ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే, ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాల్సిందిగా చంద్రబాబును ఆయన ఆహ్వానించారు.
Read Also: Nara Lokesh : లోకేష్ రాజకీయ ఎంట్రీ గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు
శుక్రవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ సదస్సును ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు తరహాలో నిర్వహిస్తున్నామని చంద్రబాబు (CM Chandrababu)కు వివరించారు.
ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానాన్ని అందించిన కోమటిరెడ్డి, సమ్మిట్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రికి తెలియజేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: