విజయవాడ సమీపంలోని గుడివాడ (Gudivada) లో శుక్రవారం ఉదయం నుంచి రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న వేళ, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేపట్టారు. తమ నిరసనలకు స్పందన లేకపోవడంతో వారు రోడ్డెక్కారు.వైసీపీ మీటింగ్‌కి హాజరయ్యేందుకు వెళ్తున్న జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక వాహనాన్ని నాగవరప్పాడు జంక్షన్ వద్ద టీడీపీ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను సమావేశానికి వెళ్లి తీరతానంటూ హారిక విరుచుకుపడినట్టు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు (The police arrived there and brought the situation under control). హారిక వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు.

పెర్ని నాని వస్తే అడ్డుతాం: టీడీపీ హెచ్చరిక
ఈ సమావేశానికి మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై టీడీపీ శ్రేణులు స్పందిస్తూ, నాని వస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశాయి. దీంతో పోలీసులకు తీవ్ర ఆందోళన మొదలైంది. ఇరు పార్టీల నేతలతో పోలీసులు మాట్లాడి ఉద్రిక్తత నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు.లింగవరంలో జరిగిన “బాబు ష్యూరీటీ.. మోసం గ్యారంటీ” అనే కార్యక్రమం కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగినా, నాని హాజరుకాలేదు. జిల్లా స్థాయి నాయకులు కూడా రాలేకపోయారు. దీంతో కార్యక్రమాన్ని స్థానిక నాయకులే ముందుండి నిర్వహించారు.
వెనిగండ్ల రాము ఇంటింటి ప్రచారం
ఇదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దీంతో నాగవరప్పాడు సెంటర్ వద్ద టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Read Also : Ind vs Eng : సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్..