తెనాలిలో (In Tenali) ఇటీవల జరిగిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ (Jagan) తీవ్రంగా స్పందించారు. ముగ్గురు యువకులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు.ఈరోజు తెనాలిలో బాధితుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. యువకులపై అక్రమంగా కేసులు బనాయించారని, చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు.రాకేష్, జాన్ విక్టర్, కరీముల్లా అనే ముగ్గురు యువకులు ఈ కేసులో బాధితులుగా ఉన్నారు. వారు దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన వారని జగన్ తెలిపారు.ఏప్రిల్ 24న తెనాలిలోని ఐతానగర్ వద్ద ఓ కానిస్టేబుల్ గొడవకు దిగాడని, యువకులు జోక్యం చేశారని వివరించారు. “మా ప్రాంతంలో ఎందుకు గొడవ చేస్తున్నారు?” అని మాత్రమే అడిగారని చెప్పారు.అయితే, మరుసటి రోజు జాన్, కరీముల్లాలను మంగళగిరి నుంచి తెనాలికి తీసుకొచ్చారని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో రాత్రంతా వారిని కొట్టారని అన్నారు.
మూడు రోజుల హింస, అబద్ధపు కేసులు
ఏప్రిల్ 26న ఐతానగర్ రోడ్డుపై మళ్లీ దారుణంగా కొట్టారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీలతో కాళ్లపై బలంగా కొట్టారని వివరించారు.తర్వాత రోజు లింగారావు సెంటర్ వద్ద మరోసారి జనం మధ్యే కొట్టారని చెప్పారు. విక్టర్ జేబులో కత్తి పెట్టి మారణాయుధంగా పంచనామా చేశారని ఆరోపించారు.కోర్టుకు తీసుకెళ్లేముందు డాక్టర్ చేత గాయాల్లేవని సర్టిఫికెట్ తీసుకున్నారని జగన్ విమర్శించారు. బాధితులను బెదిరించారని, మళ్లీ కొడతామన్నారు అని చెప్పారు.
జగన్ సంధించిన ప్రశ్నలు
ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైంది?
కానిస్టేబుల్ అక్కడ ఎందుకు ఉండాలి?
మరో స్టేషన్ సీఐ ఎందుకు ఇన్‌వాల్వయ్యాడు?
మెడికో లీగల్ ఎందుకు నమోదు కాలేదు?
వీడియోను పోలీసులే తీశారని, ఒక నెల తర్వాత బయటపడ్డదని చెప్పారు. బాధితులపై రౌడీ షీట్లు తెరుస్తారా? అని జగన్ ప్రశ్నించారు.బాధితులు చదువుకున్న వారు అని, వారి పరువును నాశనం చేశారని అన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
Read Also : Raghurama Krishnam Raju: జగన్ పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు