కొల్లిపర (గుంటూరు జిల్లా) : గత ఖరీఫ్ సీజనులో రూ.104 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారం మండలంలోని అత్తోట, శివలూరు ప్రాంతాలలో మంత్రి పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం ఎగుమతికి తెనాలిలో (Tenali) గూడ్స్ రైలు ఏర్పాటు. దళారులను నమ్మి మోసపోకండి రైతులతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల గోనె సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివలూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ గత సంవత్సరం 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. గత వైసీపి ప్రభుత్వంలో కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని రూ.10 కోట్లు మాత్రమే రైతులకు చెల్లించారని ఆయన గుర్తు చేశారు. రైతులు అకాల వర్షాల వలన ఇబ్బంది పడి దళారులకు ధాన్యం విక్రయించి ఆర్థికంగా మోసపోవద్దని చెప్పారు.
Read also: D.CM Pawan: రాష్ట్ర అంశాలపై పార్లమెంట్లో గట్టిగా గళం విప్పాలి

Minister Nadendla
బ్యాంకు ఖాతాకు జమచేస్తామని
ప్రభుత్వ భరోసాను నిండు మనసుతో స్వీకరించాలని ఆయన విజప్తి చేశారు. పతి రైతును తప్పని సరిగా ఎంత ఆలస్యమైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆదుకుంటామని ఆయన ప్రకటించారు. ఖచ్చితంగా 1792 ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని కేవలం ఐదారు గంటలలోనే రైతుల బ్యాంకు ఖాతాకు జమచేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజనుకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. రైతుల ఖాతాలలో రూ.2600 కోట్లు జమ చేయటం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో అందరం పర్యటిస్తూ రైతులకు సమస్యలు లేకుండా చేస్తున్నామన్నారు. తక్కువ ధనకు ధాన్యాన్ని విక్రయిస్తూ దళారులను ప్రోత్సహించరాదని రైతులను ఆయన కోరారు. రెండు మూడు రోజులలో 21 వ్యాగిన్లతో ఓ గూడ్స్ రైలును తెనాలిలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 1800 లారీల సరుకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. ఆదివారం ఉదయం నుంచి తెనాలి ప్రాంతంలో 85 లారీల ధాన్యాన్ని సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి మనోహర్ తెలిపారు.
గోనె సంచులను ఉచితంగా
ఇంత భారీ స్థాయిలో ఇబ్బంది ఎందుకు వస్తుందంటే 90 రోజుల పాటు జరగాల్సిన ప్రక్రియను కేవలం వారం రోజుల వ్యవధిలోనే పూర్తిచేయాలని భావించటమే ప్రధాన కారణమన్నారు. క్షేత్రస్థాయిలో గోనె సంచులను ఉచితంగా పంపిణీ చేయిస్తున్నామన్నారు. హమాలీలు, కూలీల సమస్య ఉందని సోమవారం ఆ సమస్య తీరుతుందని మంత్రి చెప్పారు. రైస్ మిల్లుల ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అనుసంధానంతో ప్రగతి సాధిస్తున్నామని మంత్రి మనోహర్ వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గుమ్మడి సిద్ధార్థ, మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసి హరికృష్ణ, అత్తోట ఉప సర్పంచ్ దివ్వెల ఏడుకొండలు, నాయకులు అడపా నారాయణరెడ్డి, వై. వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: