తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య కొనసాగుతున్న జల వివాదం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు రానుంది. జల వివాదాల కేసు సోమవారం నాడు విచారణ జరగనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ సాగనుంది. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రభుత్వం వాదించనుంది. అయితే రాజకీయ ఉద్దేశంతోనే ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. తెలంగాణ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు.
Read also: Telangana Govt: గోదావరి జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: