Breaking News-పిల్లల్ని మనమెంతో జాగ్రత్తగా చూసుకుంటాం. కంటికి రెప్పల్లా కాపాడుకుంటాం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఇటీవల వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఈ సమయంలో మనమెంతో అప్రమత్తంగా(Alert) ఉండాలి. ప్రత్యేకంగా చిన్నారుల తల్లిదండ్రులు. వర్షంలో వారు ఆడుకునేందుకు బయటకు పరుగెత్తేందుకు ఇష్టపడతారు. పొంచి వున్న ప్రమాదం వారికి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులే ఆ సమయంలో వారు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. తాజాగా ఓ చిన్నారు ఆడుకునేందుకు వర్షంలో బయటికి వచ్చింది. అప్పటికే రోడ్లపై నీరు ప్రవహిస్తున్నాయి. కాలువ కూడా నీటితో మునిగిపోయి, పైకి ఏమాత్రం కాలువ కనిపించకుండా పోయింది.
వైరల్ గా మారిన వీడియో
వర్షం పడుతున్న సమయంలో ముగ్గురు చిన్నారులు రోడ్డుపై ఆడుకోవడానికి బయటికి వచ్చారు. అక్కడే రోడ్డు పక్కనే ఒక ఇంటి ముందు ఉన్న కాలువలో వాటర్ స్పీడ్గా వెళ్తుంది. దాన్ని చూసేందుకు ఆ ముగ్గురిలో ఒక బాలిక, మరొక బాలుడు వెళ్లారు అయితే నీళ్లు ఎక్కువగా ఉండడంతో కాలువ కనిపించలేదు. దీంతో ఆ చిన్నారి బాలుడు అందులో పడి కొట్టుకుపోయాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న మరో బాలుడు ఒక్కసారిగా షాకయ్యూడు. వెంటనే బాలిక, బాలుడు కలిసి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి పరిగెత్తారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్ గా మారింది. అది చూసి చాలామంది నెటిజన్లు తల్లిదండ్రులకు సూచనలు ఇస్తున్నారు. వర్షాకాలంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షం కురుస్తున్న సమయంలో పిల్లల్ని ఒంటరిగా బయటకు రాకుండా చూసుకోవాలి.
– నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు ఎంత ప్రమాదకరమో పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేయాలి. వాటికి దూరంగా ఉండమని చెప్పాలి.
–పిల్లలకు తప్పనిసరిగా స్విమ్మింగ్ నేర్పించాలి.
– స్విమ్మింగ్ తెలుసుకదాని నీటిలో ఈత కొట్టవద్దని హెచ్చరించాలి.
– వర్షంలో పిల్లల్ని పాలు వంటి వాటిని కొనేందుకు ఒంటరిగా కిరాణ షాపులకు పంపకండి.
– బయటకు వెళ్లడం తప్పనిసరైతే, వారితో మీరు కూడా వెళ్లండి.
– వర్షాకాలంలో నీరు చేరిన ప్రదేశాలు, మురుగు కాలువలు, లోతైన గుంటలు చాలా ప్రమాదకరంగా మారతాయి. మీ పిల్లల్ని అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి.
చిన్నారి నీటి కాలువలో పడిన ఘటన ఎక్కడ జరిగింది?
ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ చిన్నారి కాలువలో పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఏమి జరిగింది?
ఒక చిన్నారి ప్రమాదవశాత్తు నీటి కాలువలో పడిపోయి ప్రవాహానికి కొట్టుకుపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: