- తెలుగుమహాసభల్లో కవితాగానం, సాహిత్య ప్రసంగాలు చేసిన కవయిత్రులు
విజయవాడ : మాతృభాషా జౌనతిని వివరిస్తూ, తెలుగు కమ్మదనాన్ని వివరిస్తూ గుంటూరు శ్రీసత్యసాయి నగరం మూడు రోజులుగా ఆంధ్రసారసత్వపరిష్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఇక్కడ మూడు రోజులు కవితా అక్షర పరిమిళల కవి ఝరి ప్రవహిస్తుంది. సుప్రసిద్ధ సాహితీవేత్త కలిమిశ్రీ. రచయిత్రులు త్సవటల్లి నీరజాచంద్రాన్ సమన్వయంలో కవి సమ్మేళనాలు జరుగుతున్నాయి. ప్రకృతి, వ్యక్తిత్వ వికాసం, సమాజ అసమానతలు, విద్య, మహిళల జీవితం, సనాతన ధర్మం, కాలుష్య పోకడలు ఇలా అన్ని రంగాలనూ స్మృశిస్తూ మనసులోని భావాలకు అక్షర రూపమిస్తూ సాహిత్యంలో యువ రక్తం పరవళ్లు తొక్కుతోంది. గుంటూరులో (Guntur) జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు వేదికగా యువ కవులు, కవయి త్రులు, కవిత్వాలు, రచయితలు తమ రచనలను చెప్పారు.
Read also: Iconic Bridge : ఐకానిక్ వంతెనకు టెండర్లను ఆహ్వానించిన కేంద్రం

Telugu Mahasabhalu
ఈ సందర్భంగా కొందరు తమ భావాలను పంచుకున్నారు. విజయవాడ వాసి పుచ్చా చిన్మయి. ఇంటర్ రెండో ఏడాది చదువు తుంది. చిన్మయి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచీ పుస్తకాల్ని చదివించేవారు. అలా తెలుగుపై ఇష్టం ఏర్పడేలా చేశారు. బాలభారతం, నీతికథలు ఎక్కువగా చదువుతుంది. కవిత్వం రాస్తుంది. తరగతిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాలప్రతిభా పురస్కారం అందించింది. చేప జీవితాన్ని స్పృశిస్తూ రాసిన గాజు గదిలో కవిత్వం చిన్మయికి మంచి గుర్తింపును తెచ్చింది. విద్యావ్యవస్థలోని లోపాలపై బాల ఖైదీ, కాలుష్యంపై ప్రకృతి బ్రహ్మ కవిత్వాలను రాసింది. ఆడపిల్ల జీవితంలోని ఒడుదొడుకులు, ఎంచుకున్న రంగంలో విజయం సాధించేందుకు పడే తపన పై నవల రాయాలనుకుంటుంది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి జీవితం తనకు స్ఫూర్తి అని చెబుతోంది.
శ్రీకాకుళం జిల్లా వాసి ఎచ్చెర్ల పి. హిమలక్ష్మి. కవయిత్రిగా తొలిసారి తెలుగు మహాసభల్లో పాల్గొంది. మొదటిసారి కవిత్వాన్ని వినిపించడం ఆనందాన్ని ఇచ్చిందని హర్షం వక్తం చేస్తుంది. ప్రకృతి నా నేస్తం అనే కవిత్వాన్ని వినిపించింది. చిన్నతనం నుంచి తెలుగన్నా, ప్రకృతి అన్నా ఎంతో ఇష్టమని చెబుతోంది. ఇదే నన్ను సాహిత్యం వైపు నడిపించిందని హిమహాలక్ష్మి తెలిపింది. పరిసరాల్ని చూస్తూ ఆరాధిస్తూ కవితలు రాస్తోంది. ఇప్పటిదాకా 150 వచన కవిత్వాలు రాసింది. తిరుపతి వాసి కె.నవీన్ కుమార్, తిరుపతిలో నిర్వహించిన తెలుగు మహాసభలకు తొలిసారి విద్యార్థిగా హాజరయ్యారు అప్పుడే నవీన్ కుమార్కు కవి సమ్మేళనంలోని శ్రీశ్రీ కవిత్వం గురించి తెలిసింది.
ఆయన రాసిన రచనలపై ఇష్టం ఏర్పడింది. మహా ప్రస్థానం చదివాను. అందులోని ప్రతి పదమూ నా మనసుకు హత్తుకుంది. అప్పటి నుంచి సాహిత్యం వైపు అడుగులు వేశాను అని నవీన్ కుమార్ తెలిపారు. ఆలయాల గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన పంచాక్షరి కవిత్వంతో ఎంతో గుర్తింపు వచ్చింది. తెలుగు గొప్పతనాన్ని వివరిస్తూ అమ్మ నేర్పిన మొదటి అమ్మ తెలుగు కవిత్వాన్ని చెప్పాను అని అన్నారు. చిర్యాలకు చెందిన కాపురపు రవికుమార్. ఎంబీఏ పూర్తి చేశారు. విరాగి కలం పేరుతో రచనలు రాస్తున్నారు. పదో తరగతిలో తెలుగు మాస్టారు. చెప్పిన గుర్రం జాషువా పద్యాలు సాహిత్యంపై ఇష్టాన్ని పెంచాయని చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: