విజయవాడ : తెలుగులోనే మాట్లాడతామని సంక్రాతికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసుకోవాలి మానవ సంబంధాల్లో వ్యక్తీకరణ భాష అని, వీనుల విందైన సౌందర్యమైన తెలుగు భాష రామాయణ కాలం నుంచే ఉందని, తెలుగు వెలుగుకు అందరూ కృషి చేయాలని భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (vankaiah naidu) కోరారు. ఏటుకూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల సమాపనోత్సవ సభ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. తెలుగు మాట్లాడకపోతే సంపూర్ణ మనుగడ ఉండదని, ప్రాణం వున్నా జీవం లేనట్లేనని ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు వాడు తెలుగు మాట్లాడితే తెలుగు బతుకుతుందని ఆయన స్పష్టం చేశారు. పాలనా భాష తెలుగులోనే ఉండాలని, పథకాలకు తెలుగు పేర్లు పెట్టాలని ఆయన సూచించారు. అందమైన తెలుగు భాష ఆత్మ సింధువులాంటిదని అభివర్ణించారు.
Read also: Breaking News: AP: నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్

The Telugu language will survive only if we speak in Telugu
మాతృ దేశాన్ని, మాతృ భూమిని, మాతృ భాషను ప్రేమించకుంటే బతికివున్నా చనిపోయినట్లే అని ఆయన అన్నారు. తెలుగు పాఠశాల వీధి బడిలో చదువుకునే తాను ఉప రాష్ట్రపతి అయ్యానని, మాతృ భాషలో చదివిన వారే అత్యున్నత స్థానాల్లో ఉన్నారని, అందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తాజా నిదర్శనమని వెంకయ్య నాయుడు వివరించారు. ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ భాష తెలుగు లోనే మాట్లాడుకోవాలని, భాష పోతే శ్వాస పోయినట్లేనని ఆయన చెప్పారు. భాష కోసం ఉద్యమించాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరు తెలుగు లోనే మాట్లాడితే భాషాభివృద్ధి జరుగుతుందన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కవులు కళాకారులు కృషి చేయాలని, మాతృ భాషను గౌరవించాలని కోరారు.
పరాయి భాషను ద్వేషించక్కర లేదని, ప్రభుత్వం ఉత్తర్వులు మాతృ భాషలోనే ఉండాల్సిన అవసరం ఉందన్నారు. డా. గజల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సమాపనోత్సవ సభలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే రవి కుమార్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, బాలకోటయ్య, బిజెపి అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్, నటుడు సాయి కుమార్, మా శర్మ, దవేజీ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. బోధన్ కు చెందిన ఫాతిమా భగవద్గీతను ఐదు భాషల్లోకి అనువదించగా ఆ గ్రంథాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. దేశం తెలుగు అంటూ గుమ్మడి గోపాలకృష్ణ పద్యగానంతో ఉర్రూతలూగించారు. నటుడు సాయి కుమార్ ను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. రెడ్ క్రాస్ చైర్మన్ వై. డి. రామారావు, సోమంచి విజయ్ కుమార్ లను సత్కరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: