‘సదాస్మరామి’ పుస్తకావిష్కరణ సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ విజయవాడ : మన సంస్కృతిని కాపాడేది మన మాతృభాష మాత్రమే, అమ్మ భాషను గౌరవించేవారే నిజమైన సాహితీ మిత్రులు అని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ అన్నారు. గుంటూరులోని భారతీయ విద్యాభవన్ బొమ్మిడాల కృష్ణమూర్తి ఆడిటోరియంలో జరిగిన ‘సదాస్మరామి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పుస్తకాన్ని ఆవిష్క రించిన అనంతరం మాట్లాడుతూ సదాస్మరామి పుస్తకంలో రచయిత మండలి బుద్దప్రసాద్ 39 మంది సాహితీ ఉద్దండుల వివరాలను ప్రస్తావించారన్నారు. అడవి బాపిరాజు నుంచి సుసర్ల దక్షిణామూర్తి వరకు, రాపాక ఏకాంబరాచార్యుల వైశిష్ట్యం నుంచి యద్దనపూడి సులోచనారాణి నవలా ప్రస్థానం వరకు సవివరంగా తెలిపారన్నారు.
Pawan Kalyan: కురుపాం గురుకుల విద్యార్థినుల మృతిపై పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

Telugu language
‘తెలుగు భాష చాలా గొప్పది. మనం తెలుగువారిలా పుట్టినందుకు గర్వించాలి. అలాంటి భాష నశిస్తే జాతి నశిస్తుందని గుర్తెరగాలన్నారు. కులమతాలు, ప్రాంతీయ విభేదాలు, పక్కన పెట్టి జాతి వైభవానికి కృషి చేయాలని పుస్తక రచయిత, అవనిగడ్డ శాసనస భ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మద్రాసులో ఏ ఉద్యమం జరిగినా తెలుగు నాయకుల పాత్ర స్పష్టంగా ఉందని, వారి గురించి జాతీయ స్థాయిలో చెప్పుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిల్చిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ బొమ్మి డాల శ్రీకృష్ణమూర్తి, వీవీఐటీ విశ్వవిద్యాలయం పబ్లికేషన్ డివిజన్ సమన్వయకర్త మోదుగుల రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మన సంస్కృతిని కాపాడేది ఏమిటని జస్టిస్ బి. కృష్ణమోహన్ అన్నారు?
మన సంస్కృతిని కాపాడేది మన మాతృభాష మాత్రమేనని ఆయన అన్నారు.
‘సదాస్మరామి’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
మండలి బుద్ధప్రసాద్ ‘సదాస్మరామి’ పుస్తకాన్ని రచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: