విజయవాడ : మీ మద్దతుతోనే కూటమి సూపర్ హిట్ డల్లాస్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం, మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా డల్లాస్ లోని కర్టిస్ కల్ వెల్ సెంటర్ నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ (Nara lokesh) పాల్గొన్నారు. ముందుగా హరిహర పీఠం వేద పండితులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ….. ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బిజెపి కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అమెరికాలో నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను, రెండేళ్లు వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను.
Read also: AP: టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

Will support Andhras from abroad
మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత
మరో రెండేళ్లు స్టాన్ ఫోర్డ్లో ఎంబీయే చేశాను. ఈ దేశంలో సుమారు తొమ్మిదేళ్లు ఉన్నాను. కానీ ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగింది. నేను ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా ఆరుగురు పోలీసులు వచ్చారు. వారు నన్ను ఇక్కడ ఆగండి అని చెప్పారు. బయట చాలా రద్దీగా ఉంది, మీరు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదు అని చెప్పారు. డల్లాస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంతపెద్ద ఘనస్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ చాలామంది నాకు ప్రతిపక్షం రోజుల నుంచి పరిచయం ఉన్నవారు ఉన్నారు. వారిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. చంద్రబాబు గారిని 53 రోజులు పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు. డల్లాస్లో ఏకంగా మూడు కార్యక్రమాలు నిర్వహించారు.
అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు
మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. ఈ రాజకీయాలు మనకు అవసరమా ఆనాడు బ్రాహ్మణి అడిగారు. అమెరికాలో, హైదరాబాద్లోని స్టేడియంలో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి సుమారు 45వేల మంది వచ్చి మాకు అండగా నిలబడ్డారు. ధైర్యం ఇచ్చారు. ఈ వేదికపై నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరు అండగా నిలవడం వల్లే అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క ఎపిలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్రంలో ప్రధాని మోడీ గారి నాయకత్వం, ఎపిలో చంద్రబాబు గారి నాయకత్వం, మరో వైపు నాకు అన్నసమానమైన పవనన్న నాయకత్వంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. అనంతపురం జిల్లాను ఆటో మోటివ్ హబ్ గా చేశాం, కర్నూలులో పెద్దఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకువస్తున్నాం.
చిత్తూరు. కడపకు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, నెల్లూరు జిల్లాకు డైవర్సిఫైడ్ మాన్యుఫ్యాక్చరింగ్, సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువచ్చాం. ప్రకాశంను సిబిజి హబ్ తయారుచేస్తున్నాం. కృష్ణా. గుంటూరులో రాజధానితో పాటు క్వాంటమ్ కంప్యూటర్ తీసుకువస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వాను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. రిఫైనరీలు, అనేక మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఐటీ, ఫార్మా, మెడికల్ డివైసెస్ మాన్యుఫ్యాక్చరింగ్ తో పాటు ఆర్సెల్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. మేం తిరగని దేశాలు లేవు. గత 17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 16 లక్షల మందిగి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు..
ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసినవ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనల్ని మదరాసీలు అనేవారు. మదరాసీలు కాదు.. తెలుగువాళ్లం ఉన్నామని దేశానికి చాటిచెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్ గారు. అభివృద్ధి చేసి ఎన్నికల్లో గెలవవచ్చని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు గారు. ఐటీ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారు చెబితే.. కంప్యూటర్లు అన్నం పెడతాయా అని ఆనాటి ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేశారు. ఇప్పుడు మిమ్మల్నందరినీ అడుగుతున్నా.. కంప్యూటర్ అన్నం పెడుతోందా అని. హైదరాబాదు పెద్దఎత్తున ఐటి కంపెనీలు తీసుకువస్తే విమర్శించారు. మీరొక్కసారి హైటెక్ సిటీకి వెళితే.. గుర్తుపట్టలేని పరిస్థితి.
చంద్రబాబునాయుడు గారు దార్శనిక నాయకుడు..
చంద్రబాబు ఐటీని పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరుకు హైదరాబాద్ పోటీ ఇస్తోంది. చంద్రబాబు వయసు 75 ఏళ్లు. 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారు. గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ. ఆయన ముందు చూపు ఉన్న నాయకుడు. తెలుగుజాతికే అది ఒక అదృష్టం. దేశంలో ఏ పార్టీ ప్రకటించని విధంగ కార్యకర్తే మా అధినేత అని ప్రకటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు శాశ్వతంకాదు.. కార్యకర్తలే టిడిపికి బలం. అధికారంతో సంబంధం లేదు. అన్నగారిని చూసినా, ఆ పసుపు జెండా చూసినా మనకు ఎక్కడలేని ఎమోషన్. కూటమిలో విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు.. ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. గుజరాత్, ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి జరిగింది.
ఎన్డీయే కూటమి రాబోయే పదేళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కలలకు రెక్కలు పేరుతో వచ్చే ఏడాది నుంచి విదేశాల్లో చదువుకునే వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఎపి ఎన్ఆర్టీ మీకు అండగా నిలుబడుతోంది. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఎపి ఎన్ఆర్జీ మీకు అండగా ఉంటుంది. జాబ్ క్రియేటర్స్ గా తయారు కావాలి.. ఇక్కడ ఉన్న అందరూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చదువుకుని మంచి ఉద్యోగాల కోసం ఇంత దూరం వచ్చాం. ఒక్కో కుటుంబానికి దేవుడు ఒక్కో పరీక్ష పెడతాడు. 2019లో నేను మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయాను. కానీ ఆధైర్యపడలేదు. కసితో పనిచేసి 91వేల మెజార్టీతో విజయం సాధించాను. చిన్న ఎదురుదెబ్బ తగిలిందని బాధపడటం, ఆత్మహత్యలకు పాల్పడటం సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. అద్భుతంగా పెంచారు.
ఇన్నోవేషన్ హబ్ కూడా
వారి గురించికూడా. ఆలోచించాలి. అందుకే అండగా నిలబడతాం. కేవలం జాబ్ సీకర్స్ గా మాత్రమేకాకుండా జాబ్ క్రియేటర్స్ గా మనం తయారుకావాల్సిన అవసరం ఉంది. రతన్లాటా ఇన్నోవేషన్ హబ్ కూడా మీకు అండగా నిలబడుతుంది. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఒకరికొకరు అండగా నిలవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. మేం ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదు. నా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టను. మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. మా అమ్మ ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. వారి నాన్న గారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి. కానీ ఒక్క పోస్టింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ ఏనాడూ ఇన్ వాల్వ్ కాలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. వారు అవమానించారని మనం అవమానించ కూడదు. స్త్రీలను గౌరవించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: