విజయవాడలో ఏపీ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’ తనిఖీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న బాలాజీ హోటల్‌లో పోలీసులు, ఈగల్ టీమ్ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సదరు వ్యక్తి తన వద్ద ఉన్న 9 MM పిస్టల్‌తో ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపడానికి తెగబడ్డాడు. అదృష్టవశాత్తూ గన్ ట్రిగ్గర్ లాక్ ఓపెన్ కాకపోవడంతో బుల్లెట్లు బయటకు రాలేదు, ఫలితంగా పోలీసులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు, అతడు తెలంగాణలోని వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన మురళిగా గుర్తించారు.
Read Also : Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మెనూ: ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపలు!
రాష్ట్రవ్యాప్తంగా గంజాయి రవాణా మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ఏపీ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 100కు పైగా టీమ్‌లు 849 హాట్ స్పాట్స్‌లో ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఈ కాల్పుల యత్నం ఘటన పోలీసు యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిందితుడి వద్ద ఉన్న పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో మురళిని విచారిస్తున్నారు. అతను విజయవాడకు ఎందుకు వచ్చాడు? ఆ గన్ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరినైనా హత్య చేసేందుకు ప్లాన్ చేశాడా? లేక పోలీసుల నుండి తప్పించుకోవడానికి మాత్రమే కాల్పులు జరిపాడా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :