हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

TDP: ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలోనూ టీడీపీ గెలుపు

Anusha
TDP: ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలోనూ టీడీపీ గెలుపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో టీడీపీ వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. తాజాగా ఏపీలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక (TDP wins in the Ontimitta) లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు లభించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థి సుబ్బారెడ్డికు కేవలం 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. భారీ తేడాతో వచ్చిన ఈ విజయంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో ఉప్పొంగిపోయాయి.విజయ ఫలితాలు వెలువడగానే టీడీపీ కార్యకర్తలు, నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచి, బాణాసంచా వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయంతో ఒంటిమిట్ట ప్రాంతంలో టీడీపీ బలాన్ని మరోసారి చాటిచెప్పింది.

TDP
TDP

తక్కువ ఓట్లతోనే కాకుండా డిపాజిట్ కోల్పోవడం వైసీపీకి పెద్ద షాక్‌

ఇక అంతకుముందు, పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలోనూ టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఆ ప్రాంతంలో టీడీపీ (TDP) అభ్యర్థి లతారెడ్డి 6,052 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో టీడీపీకి 6,735 ఓట్లు లభించగా, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. తక్కువ ఓట్లతోనే కాకుండా డిపాజిట్ కోల్పోవడం వైసీపీకి పెద్ద షాక్‌గా మారింది.పులివెందుల ప్రాంతం గత మూడున్నర దశాబ్దాలుగా వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి బలమైన కోటగా పరిగణించబడుతుంది. అయితే, ఈసారి అక్కడి ప్రజలు టీడీపీకి విశ్వాసం చూపడం, అధిక మెజార్టీతో గెలిపించడం, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద పరిణామంగా భావించబడుతోంది. మొత్తం 10,601 ఓట్లలో 7,814 ఓట్లు మాత్రమే పోలింగ్ కావడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/cm-chandrababu-chandrababu-responds-to-pulivendulas-victory/andhra-pradesh/530211/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870