TDP Mahanadu Program: తెలుగుదేశం పార్టీ మొదటి నుండి మహిళల అభ్యున్నతికి, వారి ఆత్మగౌరవ రక్షణకు పెద్దపీట వేస్తోందని ఆ పార్టీ మహిళా నేతలు స్పష్టం చేశారు. మహానాడు వేదికగా ‘స్త్రీశక్తి’ థీమ్‌తో జరిగిన చర్చల్లో మహిళా సాధికారతపై నేతలు విస్తృతంగా మాట్లాడారు. మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప శక్తి అని వారు కొనియాడారు.
చారిత్రాత్మక నిర్ణయం: చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్
భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మహిళా సాధికారతకు అత్యంత కీలకమైన మైలురాయి ‘నారీ శక్తి వందన్ అధినియం’ (చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్).
- ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కోసం ఉద్దేశించింది కాదు.
- దేశ విధాన నిర్ణయాల్లో మహిళల స్వరం బలంగా వినిపించేందుకు ఈ సంస్కరణ తోడ్పడుతుంది.
- రాజకీయ రంగంలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.
Read Also: kalyandurg mahanadu: అట్టహాసంగా ప్రారంభమైన వర్చువల్ మహానాడు

TDP Mahanadu Program: మహిళా బలం – సమాజ ప్రగతి
“మహిళ బలపడితేనే కుటుంబం బలపడుతుంది, తద్వారా సమాజం మరింత శక్తివంతంగా మారుతుంది” అని మహిళా నేతలు వివరించారు. ప్రత్యర్థుల (గొడ్డలి పార్టీ) అణిచివేత ధోరణులను, దుష్ప్రచారాలను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమర్థవంతంగా తిప్పికొట్టాలని, టీడీపీలో మహిళలు యోధులుగా పోరాడుతారని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా, వారికి సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని నేతలు గుర్తుచేశారు:
- శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: మహిళల ఉన్నత విద్య కోసం అన్న ఎన్టీఆర్ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, చదువు అనేది మహిళల హక్కు అని చాటారు.
- ఆస్తిలో సమాన హక్కు (1986): 1986లోనే ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, అమ్మాయి కుటుంబానికి భారం కాదు, వారసత్వం అని నిరూపించిన ఘనత టీడీపీదేనని హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి నారా లోకేశ్ చారిత్రాత్మక ప్రకటన
మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఒక సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా… రాబోయే 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై మహిళా లోకం నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి సవిత మహానాడులో ‘కార్యకర్తే అధినేత’ అనే కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టెక్నాలజీని ఉపయోగించి పార్టీలో నాయకత్వాన్ని పటిష్టం చేసిన ఘనత నారా లోకేశ్‌కే దక్కుతుందని కొనియాడారు. మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రకటనపై లోకేశ్‌కు మహిళా నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, వారికి ప్రమాద బీమాతో పాటు, కష్టాల్లో ఉన్న కార్యకర్తల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తోందని గుర్తు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: