రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో తీరని అన్యాయం
TDP Leaders: గత మూడు దశాబ్దాలకు పైగా అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రతిసారి రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగించే నియోజకవర్గం గన్నవరం అనటం అతిశయోక్తి కాదు. గతంలో ఇక్కడ పార్టీ టిక్కెట్ల కేటాయింపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉత్కంఠతను రెక్కిత్తించింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి (TDP) నుండి గెలిచిన వంశీమోహన్ వైసిపి తీర్థం పుచ్చుకోవటం తదుపరి టిడిపి శ్రేణులను టార్గెట్ చేసి ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేయటం తెలిసిందే. తనకు రాజకీయ బిక్షపెట్టిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడను అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు, ఆయన భార్య భువనేశ్వరిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయటం తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు.
Read Also: Kadiri narasimha swamy temple : హనుమంత వాహనంపై కదిరి నరసింహ స్వామి దర్శనం

గత ఐదేళ్ల పోరాటం.. ఎదుర్కొన్న వేధింపులు
ఇదే సమయంలో గన్నవరం టిడిపి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటంతో రాష్ట్రవ్యాప్తం గా టిడిపి కార్యకర్తలు నాయకులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. టిడిపి కార్యాలయాన్ని ధ్వసం చేసి టిడిపి నాయకుల పైనే పోలీస్ కేసులు పెట్టారు. పచ్చని పంటపొలాలతో ప్రశాంతంగా ఉండే కృష్ణాజిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో వైసిపి నాయకులు చేసి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఫ్యాక్షన్ తరహా దాడులతోపాటు టిడిపి శ్రేణులపై లెక్కలేనన్ని పోలీస్ కేసులు పెట్టి వేధించారు. లోకేష్ యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించి బాపుల పాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో యువగళం పాదయాత్రపై వైసిపి మూకలు దాడులకు పాల్పడ్డారు. ఈదాడులను టిడిపి కార్యకర్తలు తిప్పికొట్టడంతో నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ తోపాటు నాయకులు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. దీంతో వారంతా దాదాపు రెండు నెలలపాటు ఇళ్ళు, కుటుంబాలు వదలి పరార య్యారు. ఈవిధంగా ఎన్నో వేధింపులను తట్టుకుని నిలబడ్డ టిడిపి శ్రేణులు వైసిపి అభ్యర్థి వంశీని ఓడించాలని కంకణం కట్టుకుని గత ఎన్నికల్లో పనిచేసాయి.
ఎన్నికల విజయం.. ఆపై నిరాశ
గన్నవరం పక్క నియోజకవర్గమైన గుడివాడ లోనూ ఇదే రీతిగా కొడాలి నాని అధినేత చంద్ర బాబును అరెయ్ ఒరేయ్ అంటూ దూషించటం టిడిపి శ్రేణులకు మింగుడు పడలేదు. గత ఎన్నికల్లో ఈరెండు నియోజకవర్గాలు రాష్ట్రవ్యాప్తం గా ప్రజలకు ఆసక్తి కలిగించాయి. ఈరెండు నియోజకవర్గాల ఫలితాల పై భారీస్థాయిలో పందాలు జరిగాయి. ఈరెండు నియోజకవర్గాల టిడిపి నాయకులు ఇక్కడ టిడిపి అభ్యర్ధులను గెలిపించేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికల్లో పనిచేసాయి. టిడిపికి బిజేపి, జనసేన మద్దతుగా నిలవటంతో ఈరెండు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు ఎన్నడూ రానంత మెజార్టీ సాధించి ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బకొట్టి మట్టికరిపించారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత ఈరెండు నియోజక వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని భావించగా వారి అంచనాలు తప్పాయి. రాష్ట్రస్థాయి నిమినేటెడ్ పదవుల పంపిణీలో గన్నవరం నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగింది.
న్యాయం కోసం విన్నపం
దీంతో అధిష్టానం తమను చిన్నచూపు చూసిందన్న భావన టిడిపి శ్రేణుల్లో నెలకొంది. గుడివాడ నియోజకవర్గం నుండి. వెంకటేశ్వరావుకు కార్పోరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వగా గన్నవరం నియోజకవర్గానికి మాత్రం మొండిచేయి చూపించారు. గన్నవరం నియోజకవర్గం నుండి కేవలం రెండు కార్పోరేషన్ల డైరెక్టర్ పదవులు టిడిపికి ఇవ్వగా, కమ్మకార్పోరేషన్ డైరెక్టర్ ఇచ్చినట్లు ప్రకటించినా అది ప్రకటనకే పరిమితం అయ్యింది. కనీసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల పాలక మండళ్ళలోనూ, జిల్లాస్థాయి నామినేటెడ్ పదవుల్లోనూ గన్నవరం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీకోసం పార్టీకోసం కష్టపడి పోలీస్ కేసులు ఎదుర్కొని ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడి ఆర్ధికంగా నష్టపోయిన తమకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్న అసంతృప్తి పార్టీ నాయకుల్లో నెలకొంది. తెలుగుతమ్ముళ్ల అసంతృప్తిని గమనించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ వారిని బుజ్జగిస్తున్నారు. తదుపరి పదవుల కేటాయింపులో గన్నవరం కు ప్రాధాన్యత దక్కేలా అధినేతతో మాట్లాడి నాయకులకు న్యాయం చేస్తానని భరోసా ఇస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులకు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత నివ్వాలని పారీశ్రేణులు కోరుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: