అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి చెందిన మైనార్టీ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో(TDP Joining) చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వేలాది మంది ముస్లిం మైనార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును బహిరంగంగా ప్రకటించారు.
Read Also: AP Electricity: కరెంటు చార్జీలు తగ్గించేందుకు సర్కార్ కసరత్తు: మంత్రి పార్థసారథి

వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నరసింహులు టీడీపీలో చేరడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఈ చేరికలను టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు స్వాగతించారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ రాజకీయ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాంనగర్ క్యాన్ పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమైన భారీ బైక్(TDP Joining) ర్యాలీ సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కోర్ట్ రోడ్ మీదుగా సాగుతూ రాంనగర్ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ర్యాలీ సందర్భంగా పార్టీ నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. ఈ భారీ చేరికలు అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయనున్నాయని, ముఖ్యంగా వైసీపీకి ఇది పెద్ద దెబ్బగా మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: