ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేద కుటుంబానికి ఓ సొంతిల్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు (Chandrababu) సంకల్పం. ఈ లక్ష్యాన్ని త్వరగా చేరేందుకు గృహ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులు మొదలయ్యాయి. వాటిని దశలవారీగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించేందుకు స్పష్టమైన టైమ్‌లైన్‌ను ప్రభుత్వం రూపొందించింది.చంద్రబాబు వేసిన డెడ్‌లైన్ చాలా క్లియర్‌గా ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవాలి. వీటిలో మొదటి విడతగా, వచ్చే నెలలో 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు జరగాలని సీఎం అన్నారు. సంక్రాంతికి మరో రెండు లక్షల ఇళ్లు సిద్ధం (Two lakh more houses ready for Sankranti) చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టులు ABC కేటగిరీలుగా విభజన
ఇళ్లు నిర్మించడంలో స్పీడ్ పెంచేందుకు ప్రాజెక్టులను A, B, C కేటగిరీలుగా విడగొట్టి పని చేయాలని సీఎం సూచించారు. ఇలా చేస్తే పనులు సమర్ధవంతంగా సాగుతాయని ఆయన నమ్మకం.ఇంత పెద్ద లక్ష్యం చేరాలంటే, ముందుగా పక్కా డేటా అవసరం. అందుకే సీఎం అధికారులను 15 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలన్న హామీ మేరకు అవసరమైన భూమిని గుర్తించాలని చెప్పారు.
చంద్రబాబు మరో కీలక సూచన చేశారు. పెద్ద కుటుంబాల కోసం విడివిడిగా కాకుండా, ఉమ్మడి గృహాలు నిర్మించాలనే ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు. ఇది స్థలాన్ని ఆదా చేస్తుందనే తత్వంతో ముందుకు వెళ్లడం గమనార్హం.
రూ. 919 కోట్ల నిధుల విడుదలకు సిద్ధం
త్వరలో 2.73 లక్షల లబ్ధిదారులకు రూ.919 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి పీఎంఏవై అర్బన్, గ్రామీణ్, జన్ మన్ పథకాల కింద 18.59 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 9.51 లక్షల ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గత ఏడాది ఒక్కటే చూస్తే, 2.81 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.ఇళ్ల నిర్మాణంతోపాటు మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. 4,305 లేఅవుట్లలో రహదారులు, డ్రైనేజీలు, ఇతర వసతుల కోసం రూ.3,296 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.2018లో ప్రారంభమైన టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టులో ఇప్పటివరకు 1.77 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇందులో 83,570 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించబడ్డాయి. మిగిలిన 84,094 ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ ఇళ్లు కూడా త్వరలో సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు.ఇల్లు అన్నదే ప్రతి పేద కుటుంబం కల. ఆ కలను నిజం చేయాలనే దృఢ సంకల్పంతోనే చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు వేగం పెంచుతూ, జనం కలల్ని నిజం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
Read Also :