हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu: Suravaram Sudhakar Reddy: అస్తమించిన ఎర్ర నూరీడు సంస్మరణ సభ

Sharanya
News telugu: Suravaram Sudhakar Reddy: అస్తమించిన ఎర్ర నూరీడు సంస్మరణ సభ

విజయవాడ: ఉన్నతమైన ఆలోచనా విధానాలు, నిరంతరం సమాజం కోసం పరిశ్రమించే సైద్దాంతిక విలువలున్న నాయకులకు చరిత్ర ఎన్నటికి మరువదని ఏపీలోని వివిధ అధికార, విపక్షనేతలు వ్యాఖ్యానించారు. కడవరకు ప్రజల కోసం పోరాడిన సురవరం ప్రతాపరెడ్డి తరతరాలకు ఆదర్శనీయుడన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసి, ప్రజల గుండెల్లో ఉదయించే సూరీడుగా భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు సురవరం సుధాకరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయా రాజకీయ పార్టీల నేతలు కొనియాడారు.

News telugu
News telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సంసర్మణ సభ

ఆనారోగ్య కారణంగా ఇటీవల మరణించిన సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డిని స్మరించుకుంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సంసర్మణ సభ(Sansarman Sabha)విజయవాడలోని దాసరిభనప్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, వైసీపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ పోలీటబ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్, సీపీయం మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎం. మధు తదితర నాయకులు సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తొలుత ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన తెలుగు నేలపై… వెలచిన సురవరమా… మరణమైన జననం గల మానవత సురవరమా అనే పాట వింటున్న వీక్షకుల గుండెలు బరువెక్కాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాడి అజాతశత్రువుగా సురవరం సుధాకర్రెడ్డి నిలిచిపోయారని స్పష్టం చేశారు. తెలంగాణాలో జన్మించిన ఇరు రాష్ట్రాల ప్రజలతో చెరగని ఆనుబంధాన్ని కలిగి సమాజం కోసం శ్రమించే నాయకులను చరిత్ర ఎన్నటికీ మరువదు.ప్రజల గుండెల్లో ఉదయించే సూరీడుగా భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు సురవరం సుధాకరరెడ్డి (Suravaram Sudhakara Reddy)విజయవాడలో సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో టిడిపి, వైసిపి, కాంగ్రెస్, వామపక్షనేతలుయున్న ఏకైక నాయకుడన్నారు. సిద్ధాంతాల ఆశయ సాధన కోసం పనిచేసిన కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన సురవరం విద్యార్ధి దశ నుంచే ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొని తన్కదెన ము ద్ర వేసుకున్నారని అన్నారు.

బీజేపీకి చెందిన నాయకులు కూడా సభలో పాల్గొని

పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆ దిశగా కృషి చేసేవారని తెలిపారు. నిబద్ధతతో, వ్యక్తిత్వంతో రాజకీయాలు చేయడంతో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు, చివరికి బీజేపీకి చెందిన నాయకులు కూడా హైదరాబాద్లో జరిగిన సంస్కరణ సభలో పాల్గొని ఆయన సేవలను కొనియాడారని గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రజలు పక్షంగా పోరాడిన సురవరం సుధాకర్రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం అర్కుదెన గౌరవం ఇచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిందన్నారు. కార్మిక సేవలు ఉన్నంత వరకు స్థిరస్థాయిగా ప్రజల్లో ఎల్లప్పుడు గుర్తుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ 60సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిబద్ధతతో అదే సిద్ధాంతాన్ని నమ్ముకుని చివరి వరకు కొనసాగిన నాయకుడు సురవరం అన్నారు. పార్టీ నాయకుల పరంగా ఎన్నో అవమానాలు, కష్టాలు వచ్చిన చెరగని చిరునవ్వుతో ముందుగుసాగేవారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మంచి సత్ససంబంధాలు ఉన్నాయని, బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు సహితం లెక్కచేయకుండా ఉద్యమించారని గుర్తు చేశారు. ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో కార్యకర్తలు మరణానికి కారణం సురవరమని అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి రాజశేఖర్రెడ్డి రద్దు చేయించారని తెలిపారు. సమస్యలపై ఎవరైనా వినతిపత్రాలు తీసుకువస్తే పరిశీలించి నిర్ణయం తీసుకునేవారని, సురవరం తీసుకువచ్చిన వినపత్రాలను పరిశీలించుకుండా సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునేవారని తెలిపారు. ఆయన లెవనెత్తే సమస్యలు ప్రజల మేలు కొరకేనని వాటిని పరిశీలించవలిసిన అవసరం లేదని రాజశేఖర్రెడ్డి అనేవారని గుర్తు చేశారు. యుపీఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యహారిస్తూ కార్మిక, కర్షకులకు చెందిన అంశాలపై దృష్టి సారించి హక్కులు సాధనకు కారణమైయ్యారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేస్తూ సీపీఐ విశాలాంధ్ర కోసం గట్టిగా నిలబడిందన్నారు. దీంతో సువరం పోరాడారని తెలిపారు. విభజన అనంతరం యూపీఎ మహాసభ గుంటూరులో ఏర్పాటు చేసినప్పుడు సమైక్యాంధ్ర కోసం ప్రజలు ఆకట్టుకునే విధంగా అద్భుతంగా ప్రసంగించారని తెలిపారు. ఒక ఉద్యమ ధీరుడు ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైసీపీ శాసనమండలి పక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సీపీఐ నాయకత్వంతో తనకు అనుబంధం ఉందని, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన సురవరం గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలు సమాజానికి ఎంతో అవసరం అన్నారు. చిన్న చిన్ని భిన్నప్రాయాలు ఉన్న ఉభయ కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతాలు నేటి సమాజానికి అందించాలని. పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sheep-scam-investigation-expedited-in-sheep-scam/telangana/545768/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870