हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Supreme Court: ఉభయ తారక తీర్పు

Sudha

ఎందరో మేధావుల మధనంతో రూపకల్పన జరి గిన రాజ్యాంగ నిర్మాణంలో ఎన్నో ప్రాధాన్య తాంశాలు, ప్రాథమిక హక్కులు, ఉచితానుచిత నిర్ణయాలు, వాటి పరిష్కారం. సాధ్యాసాధ్యాల పరి శీలన, హేతుబద్ధత క్రోడీకరించిన అంశాలపై దేశ కాల మాన పరిస్థితుల రీత్యా మీమాంసలు తలెత్తడం సహజం. ప్రజాస్వామ్యానికి మూల స్థంబాలుగా చెప్పబడే నాలుగు వ్యవస్థకు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నా జీవన గమ నంలో, విధి నిర్వహణలో కార్యాచరణలో తప్పటడుగులు పడకుండా తన వివేచనతో ధర్మాధర్మాల విచక్షణ మేరకు న్యాయ సూత్రాలకు లోబడి సుప్రీంకోర్టే సమవర్తిగా వ్యవ హరిస్తోంది. సమయోచితం, సందర్భోచితంతో నిమిత్తం లేకుండా పాలకులు కానీ, ఆపై వ్యవస్థలు కానీ రాజకీయ ప్రేరేపణలతో సరైన నిర్ణయం తీసుకోలేదన్న అపప్రధలు మీద పడిన సంక్లిష్ట సమయాల్లో సుప్రీం ధర్మాసనాన్ని తగు మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం ప్రతి వ్యవస్థకూ అనివార్యమైన విషయం. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) పలు విచారణ అంశాలపై చేపట్టి జటిలమైన విషయాలను తేలిక చేయగలిగింది. విషయం సంక్లిష్టమైనదే. తమిళ నాడు, కేరళ వంటి రాష్ట్రాలలో పాలకులు శాసనసభలో తీర్మానం చేసి ప్రజోపకర విధానాలను చేపట్టాలని గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపితే అక్కడ గవర్నర్లు ఏ విషయమూ తేల్చకుండా తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఆయా రాష్ట్రప్రభుత్వాల పాలనా ధికారాన్ని నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు ఈనాటివి కాదు. గతంలోనూ గవర్నర్ల వ్యవస్థపై తెలుగు దేశాధినేత ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఒంటికాలిపై ధ్వజ మెత్తారు. రాష్ట్రాల పాలన సజావుగా జరిగే విధంగా సందర్భోచితంగా సలహాలు సూచనలు ఇవ్వొచ్చు. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ బిల్లులకు ‘క్లీన్ చిట్లు ఇవ్వ కుండా తొక్కిపట్టి ఉంచడంతోనే అసలు తంటా వచ్చిప డింది. దాంతో ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’కు సుప్రీంకోర్టు (Supreme Court) రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయ తీర్పునిచ్చింది. రాష్ట్ర పతి ఉదహరించిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. స్థూలంగా తీర్పు ఎలా ఉన్నా ధర్మాసనం చాకచక్యంగా ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత అంశాలపై ముడిపడి ఉన్న డిఎంకె ప్రభుత్వం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. శాసన నిర్మాణంలో రాష్ట్రపతి, గవర్నర్లు నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని మరే వ్యవస్థ భర్తీ చేయలేదని స్పష్టం చేస్తూనే మరికొన్ని నిర్దిష్ట సూచనలు చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని స్పష్టం చేసింది. దేశసమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై చెల రేగిన చర్చపై నిశితంగా ధర్మాసనం పరిశీలించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టులపరిధిలోకి న్యాయసమీక్ష అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అభి ప్రాయపడింది. గవర్నర్లు, రాష్ట్రపతి తమ విధుల నిర్వ హణలో కోర్టులకు జవాబుదారీ కాదన్న ఆర్టికల్ 361 కోర్టులకు శిరోధార్యమే అయినా, గవర్నర్లు ఆర్టికల్ 200 కింద తన నిర్ణయాన్ని జాప్యం చేస్తూ సుదీర్ఘకాలం సాచి వేత ధోరణిలో ఉంచేస్తే ఆ సమయంలో కోర్టులు తన పరిమిత న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగించుకోకుం డా ఆ ఆర్టికల్ అడ్డుకోలేదని ధర్మాసనం అభిప్రాయపడిం ది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎఎస్ చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించిన సందర్భంలో రాష్ట్రపతి జస్టిస్ ముర్ము రాజ్యాంగంలోని 143వ నిబంధన కింది 14 ప్రశ్నలతో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం తగు వివరణలతో తీర్పునిచ్చింది. తమిళ నాడుకు చెందిన పది బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టగా వాటిని ఆమోదిస్తున్నట్లు ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ద్విసభ బెంచ్ తీర్పునిచ్చింది. కాగా ఈ తీర్పును కేంద్ర ప్రభు త్వం పై కోర్టులో సవాల్ చేయలేదు. కానీ గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయాధికారానికి గడువు విధించే విషయంలో న్యాయస్థానాలకు అధికారులు ఏ మేరకు ఉన్నదీ విశ్లేషిం చమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారాధర్మాసనాన్ని కోరింది. రాజ్యాంగాధినేతలకు బిల్లుల విషయమై గడువులు విధించడం సహేతుకం కాదన్నది. ఒకపక్క ఈ తీర్పులో సూచించిన అంశాలు కానీ అభిప్రాయాలు కానీ కర్ర విరగకుండా పాము చావకుండా అన్న ధోరణిలో తమ నిశిత పరిశీలనలను అభిప్రాయాల ద్వారా వ్యక్తీకరించా రు. రాజ్యాంగంలోని 200 నిబంధన కింద రాష్ట్ర ప్రభుత్వ బిల్లులకు సమ్మతి తెలియ చేయడం కానీ సహేతుకం కాదని అభిప్రాయపడినప్పుడు గవర్నర్ ఆ బిల్లును తిప్పి పంపించవచ్చు. లేదా నేరుగా రాష్ట్రపతికే పరిశీలనకు పంపడం వంటి ఒక ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఈ మూడు ఆప్షన్లు తప్ప గవర్నర్లకు సుదీర్ఘకాల బిల్లులను పెండిర్లో పెట్టే అధికారం లేదంది. తగు సవరణలు సూచిస్తూ, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ శాసనసభకు పంపించవచ్చు. లేదా రాష్ట్రపతికి పంపవచ్చు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంచేందుకు గవర్నర్కు ఎలాంటి విచక్షణాధికారం లేదని వివరించింది. విధుల నిర్వహణలో గవర్నర్కు వ్యక్తిగతంగా రక్షణ ఉన్నప్పటికీ ఆయన కార్యాలయం కోర్టు విచారణ పరిధిలోనే ఉంది. ఇన్ని విషయాలను పూర్తిగా విశ్లేషించి తీర్పు చెప్పిన ధర్మాసనం ఏప్రిల్ 8 నాటి తీర్పును తోసిపుచ్చలేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఆనాటి తీర్పు, పరిణామాల పర్యవసానంపై ఎలాంటి పునరాలోచన చేయనవసరం లేదని భావించినట్లే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870