sand mining scam: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) పాలనలో వెలుగుచూసిన ఇసుక అక్రమ తవ్వకాల కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు(Supreme Court)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్జీటీ విధించిన రూ.18 కోట్ల జరిమానాపై జేపీ వెంచర్స్ సోమవారం సుప్రీంకోర్టులో ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్ (IA) దాఖలు చేసింది.
ఈ జరిమానా తమపై మోపడం సరైంది కాదని కంపెనీ వాదించింది. ఇసుక తవ్వకాల కోసం అవసరమైన పర్యావరణ అనుమతులు ప్రభుత్వమే పొందిందని, తాము కేవలం కాంట్రాక్ట్ ప్రకారం తవ్వకాలు నిర్వహించినందువల్ల జరిమానా భారం ప్రభుత్వానిదేనని జేపీ వెంచర్స్ వాదనలు వినిపించింది.
Read Also: TG High Court: ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ

చిత్తూరు ఇసుక తవ్వకాలు
చిత్తూరు జిల్లాలోని ఆరణీయార్ నది పరివాహక ప్రాంతంలోని బి-2 కేటగిరీకి చెందిన 18 రీచ్‌లలో అక్రమ తవ్వకాలు జరిగాయని పేర్కొంటూ ఎన్జీటీ రూ.18 కోట్లు జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయంపై కంపెనీ సుప్రీం(Supreme Court)ను ఆశ్రయించగా, ఉచిత న్యాయస్థానం జరిమానా మొత్తాన్ని ముందుగా కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై సవరణ కోరుతూ జేపీ వెంచర్స్ తాజాగా ఐఏను దాఖలు చేసింది.
ప్రస్తుతం మొదటిసారి ఈ కొత్త వాదనను తెరపైకి తెచ్చిన కంపెనీ సమాధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను వచ్చే సోమవారం వరకు వాయిదా వేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: