పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి(Pinnelli Venkataramireddy) సుప్రీంకోర్టులో(Supreme court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తమ అరెస్ట్‌ను నిలుపుదల చేయాలని కోరుతూ వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నాడు కొట్టివేసింది.
Read Also: Kerala: కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు
ముందస్తు బెయిల్‌కు అనర్హులుగా నిర్ధారణ
జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్‌కు అర్హులు కారని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక, గతంలో వారి అరెస్ట్‌పై తాము విధించిన మధ్యంతర(Supreme court) ఉత్తర్వులను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో, పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాది తమ క్లయింట్లు లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.
హత్యకేసు వివరాలు, దర్యాప్తు
ఈ దారుణ ఘటన ఈ ఏడాది మే 24న జరిగింది. గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై బైక్‌పై తిరిగి వస్తుండగా, వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్ద స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును రాయితో కొట్టి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్యేనని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, మృతుల బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ-6గా, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఏ-7గా ఉన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: