Sunil Naik Interrogation: రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను 5 రోజుల పాటు విచారించనున్నారు. ఈనెల 5 నుంచి 9 వరకు, రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని సునీల్ నాయక్‌ను హైకోర్టు ఆదేశించింది.
Read Also: AP CM : చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఐదో రోజు విచారణకు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని బృందం, ఈ ఘటనకు సంబంధించి సునీల్ నాయక్ను సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. గుంటూరు సీపీఎస్ స్టేషన్ లో ఉదయం 10 గంటల నుంచి విచారణ సాగనుంది. అప్పట్లో జరిగిన పరిణామాలపై కీలక అంశాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సునీల్ నాయక్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: