అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని తన్మయిపై (Student Tanmayi) జరిగిన హత్య సంఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి బయటకు వెళ్లిన తన్మయి అనంతరం కనిపించకపోవడం, బుధవారం నాటికి హత్య చేసినట్టు తేలడం స్థానికులను కలచివేసింది.జూన్ 4న విద్యార్థిని కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు (Complaint to the police) చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో లభించిన ఆధారాల ప్రకారం, తన్మయి జూన్ 3వ తారీఖు రాత్రి 9 గంటల సమయంలో ఓ యువకుడితో బైక్‌పై వెళ్లినట్టు తెలుస్తోంది.పోలీసుల విచారణలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. మణిపాల్ స్కూల్ వెనుక ప్రాంతంలో విద్యార్థినిపై దాడి జరిగినట్టు ఆధారాలు లభించాయి. అక్కడ ఆమెను బీర్ బాటిల్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇది మరొక దారుణమైన మానవత్వ హననంగా మిగిలింది.
ముగ్గురు యువకులతో పరిచయం.. విచారణలో కదలిక
తన్మయికి ముగ్గురు యువకులతో పరిచయం ఉన్నట్టు సమాచారం. వారిలో ఒకరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది. హత్యలో నిజంగా ఎంతమంది పాల్గొన్నారన్నది ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి దర్యాప్తుతోనే నిజాలు వెలుగులోకి రానున్నాయి.
సీఐ రాజేంద్రనాథ్ వివరణ
సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఈ కేసుపై స్పందిస్తూ, మిస్సింగ్ ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు. హత్య కేసులో ఇప్పటికే పలు ఆధారాలు లభించాయన్నారు. పూర్తి సత్యం త్వరలో బయటపడుతుందని చెప్పారు.
Read Also : MEPMAAP : పేదరిక నిర్మూలనకు ఏపీ మెప్మాకు అవార్డుల పంట