టిడిపి ది అరాచకపు పాలన అయ్యుంటే మాజీమంత్రి రోజా (Roja) క్షేమంగా నగరి వెళ్ళగలిగేది కాదని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు, రౌడీయిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అని ఆయన విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేసే వైసిపి నేతలు.. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం దారుణం అన్నారు. టిడిపి నేతల హత్య కేసులో నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడంటూ రోజా వ్యాఖ్యానించడం సిగ్గు చేటు అన్నారు.
Read also: Madhavi: వ్యక్తిగత భద్రతతోనే సురక్షిత ప్రయాణం
నెల్లూరులోని టిడిపి కార్యాలయంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. రోజా కూడా టీడీపీని విమర్శించడం చూస్తుంటే ఏడవాలో.. నవ్వాలో అర్థం కావడం లేదన్నారు. టీడీపీని విమర్శించే స్థాయి రోజాకు లేదన్నారు. రోజా ఎంత.. ఆమె బతుకు ఎంతా అంటూ వ్యాఖ్యానించిన కోటంరెడ్డి, ఆమె ఒక వలస పక్షివి అంటూ మండిపడ్డారు.
టీటీడీ లెటర్స్ అమ్ముకున్న రోజా కూడా మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు పగటి కలలు కంటున్నారని, అది జరగదన్నారు. గత ప్రభుత్వంలో రిజర్వాయర్స్ కి నిధులు కేటాయించిన వేస్ట్ ముఖ్యమంత్రి జగన్ అంటూ మండిపడ్డారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే పట్టించుకోలేదన్నారు.

ఆఫ్రాన్ కి నిధులు
సోమశిల ఆఫ్రాన్ కి నిధులు ఇవ్వమంటే జగన్ పైసా కూడా విడుదల చెయ్యలేదనీ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు విడుదల చేశారని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతున్నా.. రోజా కళ్ళున్న కాబోదిలా మాట్లాడుతుందన్నారు. ఎవరు అమలు చెయ్యలేని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
జగన్ అరాచక పాలన చూసి ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతికి పాల్పడ్డ రోజా.. నీతి వాక్యాలు వల్లించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవినీతి అక్రమాలు రౌడీయిజాలు చేసే ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని కోటంరెడ్డి హెచ్చరించారు..
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: