శ్రీకాకుళం జిల్లా(Srikakulam) కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో బాధాకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ(Andhra Pradesh Endowments Department) అధికారికంగా స్పందించింది.
Read Also: Srikakulam Stampede:దుర్ఘటనపై మోదీ సంతాపం – మృతుల కుటుంబాలకు పరిహారం
దేవాదాయ శాఖ ప్రకారం, కాశీబుగ్గ వేంకటేశ్వర(Srikakulam) ఆలయం పూర్తిగా ప్రైవేట్ దేవాలయం అని, అది ప్రభుత్వ నియంత్రణలో లేదని పేర్కొంది. ఆలయ నిర్వాహకులు ఈ వేడుక లేదా ఉత్సవం గురించి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. అలాగే, “నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగింది” అని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. భక్తుల రద్దీని అంచనా వేయడంలో లోపం జరిగిందని, భద్రతా ఏర్పాట్లు తగిన స్థాయిలో లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
ఇక ఈ ఆలయాన్ని ఇటీవలే ప్రారంభించారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవం తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు, పోలీసులు సంయుక్త విచారణ ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: