ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన శ్రీకాకుళం జిల్లా(Srikakulam District Crime) ఆమదాలవలస మండలం వెదుళ్లువలస గ్రామానికి చెందిన సవలాపురపు నాగమణి(28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తమ కుమార్తె నాగమణి గతంలో నాలుగేళ్లు అక్కడ పనిచేసి డబ్బులు పంపించేదని ఇటీవల ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి మళ్లీ పని కోసం వెళ్లి నాలుగు నెలలు అయిందని మృతురాలు తల్లి సరోజిని బుధవారం తెలిపారు. ఒక ఏజెంట్ ద్వారా అక్కడికి పనికి వెళ్లారని చెప్పారు. నాగమణి మూడు రోజుల క్రితం ఫోన్ చేసి తనకు ఇక్కడ చాలా తీవ్ర ఇబ్బంది పెడుతూ, వేధిస్తున్నారు… స్వగ్రామం వచ్చేస్తానని చెప్పిందని, ఇబ్బందిగా ఉంటే వచ్చేమని తాము చెప్పామని వివరించారు. కానీ ఏం జరిగిందో తెలియదు అక్కడ ఏజెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఇక్కడ మస్కిట్లో ఆత్మహత్య (Suicide) చేసుకుందని చెప్పారని కన్నీరు మున్నీరయ్యారు.
Read also: భాగస్వామ్య సదస్సుకు విశాఖ రెడీ

మృతదేహం స్వదేశానికి రప్పించేందుకు చర్యలు ప్రారంభం
ఆత్మహత్య చేసుకున్న ఫోటోలు పెట్టమని అడిగితే వాళ్ళు పెట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె నాగమణి మృతి(Srikakulam District Crime) చెందిన విషయాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లి అక్కడ నుంచి తమ కుమార్తె మృతదేహం వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారని పేర్కొన్నారు. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుచున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: