తొలి మూడురోజులు ఇ-డిప్ సర్వదర్శన టోకెన్ల
తిరుమల : వైఖానస ఆగమంప్రకారం పూజలందుకుంటున్న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పదిరోజుల వైకుంఠద్వారదర్శనాలను పూర్తిగా ఈ ఏడాది(Sri Venkateswara Swamy) ఆన్లైన్లోనే విడుదలచేసేలాతిరుమల తిరుపతి(Tirupati) దేవస్థానం నిర్ణయించింది. గతంకంటే భిన్నంగా డిసెంబర్ 30వతేదీ వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, 2026 నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి 1న దర్శనాలకు సంబంధించి పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఈ డిప్ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు. ఈ టోకెన్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠద్వార దర్శనానికి అనుమతిస్తారు. జనవరి 2వతేదీ నుండి 8వతేదీ వరకు వారం రోజులు ఎటువంటి దర్శన టిక్కెట్లు, టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు వచ్చినా సామాన్యభక్తులను యధావిధిగా సర్వదర్శనంలో అనుమతిస్తారు. డిసెంబర్ 30,31, జనవరి 1తేదీల్లో మూడురోజులు ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు తప్ప మిగిలిన అన్ని దర్శనాలు రద్దుచేశారు. వివిఐపిలు, విఐపిలు స్వయంగా వస్తేనే వారికి వైకుంఠద్వార దర్శనాలు కల్పిస్తారు. జనవరి 2వతేదీ నుండి 8వరకు ఆన్లైన్లో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశదర్శనాల టిక్కెట్లురోజుకు 15వేలు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు రోజుకు వెయ్యిలెక్కన ఆన్లైన్లో విడుదల చేస్తారు.
Read also: పుట్టపర్తిలో ప్రధాని మోదీ

ఆఫ్లైన్ టోకెన్ల వ్యవస్థ పూర్తిగా రద్దు
గత ఏడాది వరకు సామాన్యభక్తుల కోసం ఆఫ్లైన్లో అమలైన టోకెన్లు విధానం పూర్తిగా రద్దుచేశారు. ఈ ఏడాది డిసెంబర్ 30,31 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలతోబాటు అదనంగా మరో ఎనిమిదిరోజులవైకుంఠ ద్వార దర్శనాల విధానంపై మంగళవారం తిరుమల అన్నమయ్యభవనంలో టిటిడి ధర్మకర్తలమండలి అత్యవసర సమావేశమైంది. టిటిడి చైర్మన్ బిఆరా నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో టిటిడి ఇఒ అనిల్కుమారి సింఘాల్, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సివిఎసిఒ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఇఒ ఎం. లోకనాథం, వింగ్ విఎస్ఒ ఎన్టీవిరామ్కుమార్, బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నర్శిరెడ్డి, పనబాకలక్ష్మి, శాంతారామ్, జాస్తిపూర్ణసాంబశివరావు, సదాశివరావు, ఎంఎస్ రాజు, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, పిఆర్, నీలిమ తదితరులు పాల్గొన్నారు.
2020 తర్వాత మారిన దర్శన విధానం
గతంకంటే భిన్నంగా 2020వ సంవత్సరం వరకు తిరుమల ఆలయంలో వైకుంఠద్వార దర్శనం ఏకాదశి, ద్వాదశి ఘడియల్లోమాత్రమే 48గంటలు పాటు ద్వారాలు తెరచి భక్తులను అనుమతించేవారు. ఆ తరువాత సామాన్యభక్తుల నుండి వచ్చిన వినతులు, వైష్ణవాలయం శ్రీరంగంలో అమలవుతున్న పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలను అప్పటి వైసిపి బోర్డు అమలుచేసింది. అయితే ఆన్లైన్తోబాటు ఆఫ్లైన్లో తిరుపతిలో పదికౌంటర్లలో ఉచిత సర్వదర్శన టోకెన్లు జారీచేసి అనుమ తించేవారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన విషాద ఘటనలతో టోకెన్లకోసం వచ్చి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, యాభైమందివరకు క్షతగాత్రులయ్యారు. ఈ ఘట నతో టిటిడి ప్రస్తుత బోర్డు కొన్ని మార్పులు చేపట్టింది. గత ఏడాది వరకు పదిరో జుల వైకుంఠద్వార దర్శనాల్లో అమలైన ఆఫ్లైన్ల ను పూర్తిగా రద్దుచేశారు. ఆ స్థానం లో ఆన్లైన్లో ఈ డిప్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో కీలకంగా నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 30నుండి 2026 జనవరి 8వతేదీ వరకు పదిరోజులు వైకుంఠద్వార దర్శనాలు అమలవుతాయి. 182 గంటలు దర్శన సమయంలో 164 గంటలు దర్శనం సామాన్యభక్తులకుకేటాంచారు. సామాన్యభక్తులకు ప్రాధాన్యతనివ్వడం కోసం తొలిమూడురోజులు ఎస్ఇడి టిక్కెట్లు, శ్రీవాణి టిక్కెట్లు రద్దుచేశారు. అన్ని ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు నిలుపుదలచేశారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనాలు అనుమతిస్తారు. సిఫార్సు లేఖలు స్వీకరించరు.
పదిరోజుల్లో తొమ్మిది లక్షల భక్తులకు దర్శనం అవకాశం
పవిత్రమైన 30,31 తేదీల్లో ఆన్లైన్లోనే టోకెన్లు: డిసెంబర్ 30,31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలతోబాటు జనవరి 1కి సంబంధించి అన్ని టోకెన్లు ఆన్లైన్ ఈ డిప్ ద్వారానే కేటాయించేందుకు నిర్ణయించారు. ఇందుకు పారదర్శకంగా అమలుచేసేందుకు భక్తులు టిటిడి వెబ్సైట్, మొబైల్యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్కోసం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 27వతేదీ నుండి డిసెంబర్ 1వతేదీ వరకు టోకెన్ల కోసం ఈ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్లో ఎంపికైన వారికి డిసెంబర్ 2వతేదీ దర్శన సమాచారాన్ని పంపుతారు. తిరుపతి, తిరుమలలో ఉంటున్న స్థానికులకు జనవరి 6,7, 8 తేదీల్లో వైకుంఠద్వార దర్శనాలకు రోజుకు ఐదువేల టోకెన్లు మొదట వచ్చినవారికి మొదట అనే విధానంలో ఆన్లైన్లో టోకెన్లు జారీచేస్తారు. పదిరోజులు తొమ్మిదిలక్షలమందివరకు భక్తులకు వైకుంఠద్వార దర్శ నాలు చేయించాలని ప్రణాళికలు సిద్ధంచేశారు. అయితే ఆఫ్లైన్లో టోకెన్లు విడుదల లేకపోవడంతో సామాన్యభక్తులు నిరాశచెందుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: