Kachiguda to Tirupati: రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే అధికారులు కాచిగూడ నుంచి తిరుపతి వరకు ఒక ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ సింగిల్ ట్రిప్(Single trip) ప్రత్యేక రైలు (నంబర్: 07511) గుత్తి మీదుగా ప్రయాణిస్తుంది.
Read Also: Chandrababu Naidu: ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి

రైలు ప్రయాణ వివరాలు:
- బయలుదేరే సమయం: ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది.
- చేరుకునే సమయం: మరుసటి రోజు ఉదయం 3.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
ఈ రైలు షాద్‌నగర్, మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, గుత్తి, తాడిపత్రి, కడప స్టేషన్లలో ఆగుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: