వైసీపీ అధినేత జగన్ రేపు నెల్లూరు పర్యటన (Jagan to visit Nellore tomorrow)కు వస్తుండటంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) రేపు జగన్ పర్యటన పై సోమిరెడ్డి స్పందన తీవ్రంగా స్పందించారు. జగన్ ఏ ముఖంతో నెల్లూరు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.జగన్ మాట విని అనేక మంది అధికారులు సమస్యలు ఎదుర్కొన్నారని సోమిరెడ్డి తెలిపారు. వారి సమస్యలను పట్టించుకోకుండా కాకాణిని పరామర్శించడానికి రావడం సరికాదన్నారు. లిక్కర్ స్కాంలో జైలుకెళ్లిన మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనంజయరెడ్డిలను కూడా జగన్ పరామర్శించాలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కాకాణి వివాదాలపై ఆరోపణలు
కాకాణి అక్రమాల వల్ల చాలా మంది అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసిన ఘటనను ఆయన గుర్తు చేశారు. జగన్ పర్యటన ముగిసిన వెంటనే కాకాణి దుర్మార్గాలను బయటపెడతానని హెచ్చరించారు.
జగన్‌కు విసిరిన సవాల్
కాకాణి చర్యల వల్ల బాధపడిన వారిని జగన్ కలవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నిజాయితీగా వ్యవహరిస్తే బాధితులను పరామర్శించాలని సూచించారు. కాకాణిపై వచ్చిన ఆరోపణలపై జగన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
టీడీపీ నేత విమర్శలు
సోమిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం నెల్లూరులో చర్చనీయాంశంగా మారాయి. జగన్ పర్యటనకు ముందు ఈ విమర్శలు మరింత రాజకీయ వేడిని పెంచుతున్నాయి. రేపటి పర్యటనలో జగన్ ఏమి మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : Chandrababu Naidu : సింగపూర్ పర్యటన ముగించుకుని ఏపీకి తిరుగు ప్రయాణ చంద్రబాబు