పాము కాటేస్తే భయపడి ఆసుపత్రికి (hospital) పరుగులెత్తడం సర్వసాధారణం. కానీ, తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలం, చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేశ్(Venkatesh) అనే వ్యక్తి మద్యం మత్తులో తనను కాటేసిన పాముపై వింతగా ప్రతీకారం తీర్చుకున్నాడు. అతను ఓ నల్లత్రాచు తలను కొరికి చంపేసి, ఆ పామును ఇంటికి తీసుకెళ్లి దాని పక్కనే పడుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

మత్తులో విపరీత చర్య
గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వస్తున్న వెంకటేశ్‌ను దారిలో ఓ నల్లత్రాచు కాటేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్, ఆ పామును వెంబడించి పట్టుకున్నాడు. కోపంతో దాని తలను నోటితో కొరికి చంపేశాడు. అనంతరం ఆ పామును తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి, దాని పక్కనే పడుకుని నిద్రపోయాడు.
అయితే, అర్ధరాత్రి సమయంలో పాము(snake) విషం శరీరంలోకి ఎక్కడంతో వెంకటేశ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స(Primary treatment) అందించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం వెంకటేశ్ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
తిరుపతి జిల్లాలోని చియ్యవరం గ్రామంలో ఈ వింత ఘటన జరిగింది.
వెంకటేశ్ పామును ఎందుకు చంపాడు?
మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్‌ను నల్లత్రాచు కాటేయడంతో ఆగ్రహంతో దానిని వెంబడించి తల కొరికి చంపేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: