ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవి తండ్రి అప్పారావు మీడియాకు స్పందించారు. తన కుమారుడు(Ibomma Ravi) చేసిన తప్పును అంగీకరిస్తూనే, తన మనవరాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రవికి తక్కువ శిక్ష పడేలా చూడాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. అప్పారావు చేసిన ఈ భావోద్వేగ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అప్పారావు మాట్లాడుతూ మా అబ్బాయి తప్పు చేశాడన్నది నిజమే. కానీ వాడికి ఓ చిన్న కూతురు ఉంది. ఆమె భవిష్యత్తు గురించే నా ఆందోళన అంతా. నా మీద దయ ఉంచి వాడిని స్టేషన్‌లో కష్టపెట్టకుండా చూడాలని కోరుకుంటున్నాను. నా మనవరాలు చాలా చురుకైనది. ఆమెను తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది అని తన బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కోడలు కూడా తనతో మాట్లాడటం లేదని ఆయన వాపోయారు.
Read also: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

చట్టానికి జాలి ఉండదు: నిస్సహాయత వ్యక్తం చేసిన తండ్రి
చట్టం ముందు అందరూ సమానమేనని తనకు తెలుసని, తన కొడుకును వదిలిపెట్టరని అప్పారావు నిస్సహాయత వ్యక్తం చేశారు. చట్టానికి(Ibomma Ravi) కరుణ దయ లాంటివి ఉండవు. తప్పు చేసిన వారందరూ ఒకటే. నా మనవరాలి కోసం నా కొడుకును విడిచిపెట్టరని నాకు తెలుసు. ఈ సమయంలో బాధపడటం, నిస్సత్తువ చెందడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు అని అన్నారు.
ఐబొమ్మ వెబ్‌సైట్(Website) ద్వారా కొత్త చిత్రాలను పైరసీ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో రవిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, రవి తండ్రి చేసిన ఈ ఆర్తితో కూడిన విజ్ఞప్తి పలువురిని కలచివేస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: