అనంతపురం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra pradesh) కీలక మంత్రులు పనిచేసిన జానారెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి నీలకంఠాపురంలో ఆదివారం సమావేశం అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అనంతపురం జిల్లా పర్యటన చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జానా రెడ్డి ప్రత్యేకంగా సిడబ్ల్యూసి సభ్యుడైన మాజీ మంత్రి రఘువీరారెడ్డి స్వగ్రామం నీలకంఠాపు రంకు వెళ్లారు. ఆయన వెంట ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తదితర నాయకులు కూడా ఉన్నారు. ఈసందర్భంగా నీలకంఠాపురంలో
రఘువీరారెడ్డి (Raghuveera reddy) ప్రత్యేకంగా నిర్మించిన నీలకం ఠాపురం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ను మాజీ మంత్రి జానారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. తదనంతరం అనంతపురంలోని వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటికి మాజీ మంత్రులు జానారెడ్డి, రఘువరెడ్డి తదితరులు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనంత వెంకట్రా మిరెడ్డితో ఉన్న స్నేహం, అనుబంధంతో మాజీ మంత్రులు వారి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతపురంలోజరిగిన ఓ వివాహ కార్యక్రమంలో మాజీమంత్రి జానారెడ్డి హాజరైనట్లు సమాచారం.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Krishna River : శ్రీశైలం, నాగార్జునసాగర్ లో వరద ఒత్తిడి