విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే జ్ఞాన ప్రక్రియ. అది కేవలం పాఠశాలల్లో, కళాశాలలో పుస్తకాలు చద వడం మాత్రమే కాదు, మనస్సును, ఆలోచనలను, ప్రవర్తనను, “వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అతి పెద్ద జీవనపద్ధతి. విద్య అనేది మనిషిని లోపల నుంచి మార్చే మహోన్నత మార్గం. నైపుణ్యంతో ముందుకు నడిపిస్తుంది. నీతి విలువలతో సరైన మార్గం చూపిస్తుంది. నవచైతన్యంతో ప్రపంచాన్ని మార్చే ధైర్యం ఇస్తుంది. ఈమూడు లక్షణాలు కలిసినప్పుడే వ్యక్తి సంపూర్ణంగా ఎదుగుతాడు. సమాజం అభివృద్ధి చెందుతుంది. దేశంముందుకు సాగుతుంది. విద్య అనేది వ్యక్తి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనం. ఇది కేవలం పుస్తకాల జ్ఞానం లేదా పరీక్షల మార్కుల వరకే పరిమితం కాదు. నిజమైన విద్యఅంటే మనిషి ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి, జీవితాన్ని సార్థకం చేసే మార్గదర్శకం. నేటి వేగవంతమైన ప్రపంచంలో నైపుణ్యాలు, నీతి, నవ చైతన్యం వంటి మూడు ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరికి అత్యంత అవ సరమైనవి. ఇవన్నీ కలిగినప్పుడు మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసం సాధ్యమవుతుంది. ఈ పరిపూర్ణతను అందించే మార్గమే సమగ్ర విద్య. నైపుణ్యం (Skill Education)ఆధునిక ప్రపంచానికి పునాది, ప్రపంచం మారుతోంది. జ్ఞానం కంటే నైపుణ్యాలే నేటి ఉద్యోగ విపణిలో ముఖ్యం అవుతున్నాయి. కంప్యూటర్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్వర్క్, సమస్య పరిష్కరణ, నాయకత్వ లక్షణాలు వంటి అనేక నైపుణ్యాలు వ్యక్తిని విజయవంతుడిగా నిలబెట్టే మెట్లు. సాంప్రదాయ విద్యలో నైపుణ్యాల (Skill Education) మీద పెద్దగా దృష్టిఉండలేదు. కానీ పుస్తకాల్ని కంఠస్థం చేసే విద్యతో ఉద్యోగాలు కూడా రాకపో వడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డా యి. కాబట్టే విద్యావ్యవస్థ నైపుణ్యాల పెంపువైపు మళ్లాలి. పాఠశాలస్థాయి నుండే ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, ప్రయో గాలు, ప్రాక్టికల్ శిక్షణ, డిజిటల్ లిటరసీ వంటి అంశాలను బలపరచాలి. నైపుణ్యం ఉన్న విద్యార్థి ప్రపంచంలోఎక్క డైనా అవకాశాలను సృష్టించగలడు. నీతి వ్యక్తిత్వ వికాసానికి నిత్యావసరం, నైపుణ్యాలు ఉన్నప్పటికీ విలువలు లేకపోతే వ్యక్తి సమాజానికి హానికరుడు అయిపోతాడు.
Read Also: Hyderabad: హైదరాబాద్ లో కార్యకలాపాలు ప్రారంభించిన సోనోకో, ఈబీజీ గ్రూప్

నవ చైతన్యం అభివృద్ధికి కొత్త దారి
నీతి అనే విలువ మనిషిని లోపలి నుంచి మార్చుతుంది నిజాయితీ, దేశభక్తి, బాధ్యతా భారతం, పరస్పర గౌరవం, కరుణ, సేవాభావం ఇవన్నీ నీతి ద్వారా వచ్చే అంశాలు. ప్రస్తుతకాలంలో విలువలు తగ్గిపోతున్నాయని మనం ప్రతిరోజూ చూస్తున్నాం. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మానవత్వం తగ్గిపోకుండా చూసుకోవడం కూడా విద్యా వ్యవస్థ బాధ్యతే. విలువల పాఠాలు, కథలు, సమాజ సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, గురుశిష్య సంబంధాల పట్ల గౌరవం ఇవన్నీ విద్యార్థుల్లో నీతిని పెంపొందించగల అంశాలు. మంచి విలువలతో ఉన్న విద్యార్థి భవిష్యత్తులో మంచి పౌరుడిగా మారతాడు. నవ చైతన్యం అభివృద్ధికి కొత్త దారి, భవిష్యత్తు నవచైతన్యాన్ని కోరుతోంది. కొత్త ఆలోచనలు,కొత్త ప్రయోగాలు, కొత్త పరిష్కారాలే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలో చనను ప్రోత్సహించడం అనేది సమగ్ర విద్యలో కీలక అంశం. కేవలం పాఠాలు నేర్పించడం సరిపోదు. ఆ పాఠాలపై సందేహాలు అడగడం, కొత్త ప్రయోగాలు చేయడం, వైఫల్యం భయపడకుండా ముందుకు సాగడం వంటి ధైర్యం విద్యార్థికి ఉండాలి. ల్యాబ్లు, ఇన్నోవేషన్ క్లబ్లు, సైన్స్ ఫెయిర్లు, స్టార్టప్ ఆలోచనలకు ప్రోత్సాహం ఇవన్నీ నవ చైతన్యాన్ని పెంపొందించే మార్గాలు. నవ చైతన్యంతో ఉన్న విద్యార్థి ఉద్యోగం కోసంవెతకడు, ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉంటాడు. సాంకేతిక రంగం నుంచి వ్యవసాయం వరకు ప్రతిచోటా ఈ సృజనాత్మక ఆలోచనకు అవసరం పెరిగింది. సమగ్ర విద్యఅనేది విద్యార్థిని ఒకే కోణంలో కాకుండా పలు కోణాలలో ఎదగనిచ్చే ప్రక్రియ. అందులో విద్యా జ్ఞానం, సృజనా త్మకత, నైతికత, సామాజిక బాధ్యత, శారీరక ఆరోగ్యం, భావోద్వేగ పరిపక్వత అన్నీ సమపాళ్లలో ఉండాలి. పుస్తకాల జ్ఞానంతో పాటు జీవితానికి అవసరమైన విలువలను నేర్పడం, నైపుణ్యాలను పెంపొం దించడం, సమస్యలను సృజ నాత్మకంగా పరిష్కరించే ఆలో చనను పోషించడం ఇవన్నీ సమగ్ర విద్యాలక్ష్యాలు. సమగ్ర విద్య ఎందుకు అవసరం అంటే సమాజంలో మార్పులు వేగంగా జరుగుతున్న ఈ యుగంలో సమగ్ర విద్యఅనేది చాలా కీలకం. ఎందుకంటే ఇది వ్యక్తిని జ్ఞానం కలిగిన వాడిగా, నైపుణ్యం ఉన్నవాడిగా, విలువలు పాటించే పౌరు డిగా, సృజనాత్మక ఆలోచకుడిగా మారుస్తుంది.
విద్యావిధానాల్లో మార్పులు అవసరం
దేశ అభివృద్ధికి ఇలాంటి పౌరులే అవసరం. పాఠశాలల నుండి ఉన్నత విద్యా సంస్థల వరకు సమగ్ర విద్యను అమలు చేయడం వల్ల ఆరోగ్యవంతమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన,బాధ్యత గల,ఆవిష్కరణాత్మక యువత పెరిగి దేశాన్ని ముందుకు నడిపించగలుగుతుంది. విద్య అనేది వ్యక్తిని మాత్రమే కాకుండా, సమాజాన్ని, దేశాన్ని కూడా మార్చగల మహాశక్తి.నైపుణ్యం, నీతి, నవ చైతన్యం ఈ మూడు అంశాలు ఏ ఒక్కరి జీవితాన్నైనా సార్ధకంగా మార్చగలవు. కానీ ఇవన్నీ ఒకే చోట పొందాలంటే సమగ్ర విద్య తప్పనిసరి. దేశవ్యాప్తంగావిద్యా వ్యవస్థలో మార్పులు వేగం పుంజుకుంటున్నాయి. నూతన యుగ అవసరాలకు అనుగుణంగా పాఠశాలల నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిట ల్అభ్యాసం వంటి అంశాలు ప్రముఖ స్థానం సంపాదిస్తున్నాయి. విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్య అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థి వ్యక్తిత్వాన్నిఅన్నికోణాల్లో అభివృద్ధి చేసేసమగ్ర ప్రక్రియకావాలని సూచిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాల్లో కూడా ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాఠశాలల్లో కొత్త కార్యక్రమాలు, నైపుణ్య ఆధారిత కోర్సులు, సాంకేతిక పరికరాల వినియోగం పెరగ డంతో విద్యార్థుల అభ్యాస పద్ధతుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రాజెక్టుఆధారిత అభ్యాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, విలువల విద్య వంటి అంశాలను తరగతులలోకి తీసుకువస్తూ పాఠశాలలువిద్యార్థు లనుభవిష్యత్తువైపు తీర్చిదిద్దుతున్నాయి. నేటితరం ఉద్యోగాలకేకాదు, జీవితానికి సిద్ధమవ్వాలి. అందుకోసం నైపుణ్యం, నీతి, సృజనాత్మకత కలిసి నడిచే విద్య అవసరం.
– సొప్పరి నరేందర్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: