విజయవాడ : ఎంఎస్ఎంఈ కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని, వాటి లబ్ది చివరి ప్రయోజనదారుల వరకూ చేరాలన్నదే తమ లక్ష్యం అని ఎంఎస్ఎంఈ, సిర్హ్పీ, ఎన్ఆర్ఎ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పథకాల అమలుపై మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉపాధి సాధనాలు రూపొందించాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. ప్రత్యేక రంగాలవారీగా అవసరాలను గమనించి నైపుణ్యాలను అందించాలని, సాధారణ పద్ధతులు ఫలితాలు ఇవ్వలేవని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివ శంకరరావు, సీఈఓ విశ్వ మనోహరన్ తో పాటు పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఈడీసీ అధికారులు పాల్గొన్నారు. ఎంఎస్ఈసిడిపి పథకం కింద ఏర్పాటు చేస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ల (సీఎఫ్సీలు) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అమలులో ఎదురయ్యే అడ్డంకులను తక్షణమే అధిగమించాలని సూచించారు.

రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ (రాంప్) పథకం అమలులో భాగంగా, జిల్లా కలెక్టర్లు నేరుగా రంగంలోకి దిగాలని మంత్రి పిలుపునిచ్చారు. పథకాలు ఉన్నా, అవి వ్యాపారవేత్తలకు తెలిసినప్పుడే ఉపయోగ పడతాయన్నారు. పిఎం విశ్వకర్మ పథకంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని ఉపాధి సృష్టి కార్యక్రమం (పీఎంఇజిపి) అమలు స్థితిగతులను కూడా మంత్రి సమీక్షించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సమాచారం సులభంగా అందించే ఉద్దేశంతో ఏఐ ఆధారిత చాట్బాటు రూపొందించాలని మంత్రి ప్రతిపాదించారు. ప్రాథమిక సమాచారం కోసం ఎంటర్ప్రైన్స్యూర్లు వేచి చూడాల్సిన అవసరం ఉండకూడదన్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Law and Order : నేరం చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు : మంత్రి పార్థసారధి