విజయవాడ Festival : గణేశ ఉత్సవాలకు సింగిల్ విండో (Single window) ద్వారా 24 గంటల్లో అనుమతి, ఎన్ఎసి ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గణేశ ఉత్సవ సమితి అభినందనలు తెలిపింది. హిందువులు 9 రోజుల పాటు నిర్వహించుకునే ఈ గణేశ చతుర్థి ఉత్సవాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ గణేశ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు, మాజీ ఎంపి గోకరాజు గంగరాజు తదితరులు అభినందించారు. ఈనెల 27న ప్రారంభమయ్యే ఉత్సవాలు సెప్టెంబర్ 4వరకు జరుగుతాయని ఈ ఉత్సవాలకు కావాల్సిన సహాయ సహకారాలను గణేశ ఉత్సవ సమితి అందిస్తుందని గోకరాజు ఈ సందర్భంగా తెలిపారు. అన్ని జిల్లాల్లో కమిటీ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఉత్సవాలకు ఆటంకాలు లేకుండా ఉచిత విద్యుత్
విద్యుత్తు వాడకం కోసం కోరిన వారికి ఉచిత విద్యుత్తు అందించడానికి ప్రభుత్వం చర్యలు (Government actions) తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే చిన్న పాటి కారణాలను చూపి ఉత్సవాలకు ఆటంకాలు కలిగించవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సింగిల్ విండో అనుమతులు ఎలాంటి రుసుము లేకుండా ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ 4న పట్టణ, నగరాల్లో ఒక శోభాయాత్రగా నిమజ్జనం కోసం బయల్దేరి గణేశుని రథాలకు గౌరవ స్వాగతం చెబుతూ వేదికలు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యావరణ కోసం మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :