భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది అభిమానుల కలలను సాకారం చేస్తూ వన్డే ప్రపంచకప్ 2025 (2025 Women’s Cricket World Cup) ను ముద్దాడింది. నిన్న జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయానికి కడపకు చెందిన యువ క్రికెటర్ శ్రీ చరణి (Shri Charani) చేసిన ప్రదర్శన ఎంతో కీలకమైంది.
Read Also: Shefali Varma: దేవుడి ఆశీస్సుతోనే ఈ విజయం సాధించా: షెఫాలీ వర్మ

మొత్తం 9 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసి ప్రపంచస్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. దీప్తీ శర్మ (22 వికెట్లు) తర్వాత భారత్ తరఫున టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బౌలర్‌గా నిలిచిన శ్రీ చరణి (Shri Charani) ప్రదర్శన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైంది.తొలిస్థానంలో ఉన్న దీప్తీ శర్మ(22) తర్వాత ఇండియా నుంచి శ్రీ చరణి మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: