ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారిని కన్నడ హీరో శివరాజ్ కుమార్ (Shivraj Kumar) దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆయనకు దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు మెమొంటోలు అందించారు. ఆలయ వేదపండితులు శివరాజ్ కుమార్‌కు వేదాశీర్వచనం పలికారు.
Read Also: Global Summit: తెలంగాణ ఆర్థిక దిశకు కీలక సమ్మిట్

అన్నప్రసాద వితరణకు భారీ విరాళం
దుర్గమ్మవారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం గుంటూరుకు చెందిన మట్ట శ్రీనివాస్, జయలక్ష్మి, పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 1,01,116 విరాళం అందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసిన అనంతరం వారికి కూడా దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు. వేదపండితులు వారికి వేదాశీర్వచనం పలికారు.
ఆలయంలో సౌకర్యాల పరిశీలన
దుర్గమ్మవారి ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఈఓ వికె శీనానాయక్ మరియు చైర్మన్ బొర్రా రాధాకృష్ణలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పలు సూచనలను ఆలయ సిబ్బందికి చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: