ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం ఎక్స్‌లో స్పందిస్తూ, సూపర్ సిక్స్… సూపర్ ఫ్లాప్ (Super Six… Super Flop) హామీలన్నీ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయని ఆమె విమర్శించారు.షర్మిల ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? రాష్ట్రంలోని 50 లక్షల నిరుద్యోగుల్లో ఒక్కరికైనా భృతి అందిందా? ప్రతి నెలా రూ.3,000 ఇస్తామని చెప్పిన మాటలు ఎక్కడ పోయాయి? అని ఆమె నిలదీశారు.20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారని గుర్తు చేశారు. కానీ ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదని విమర్శించారు. స్థాపించని పరిశ్రమలతో అగ్రిమెంట్లు సంతకం చేయడం ఉద్యోగాలు కల్పించినట్టేనా? అని ఆమె ప్రశ్నించారు.(Vaartha live news : Sharmila)
మహిళలకు హామీలు నెరవేరలేదా?
ఒక్క మహిళా కార్డుదారికి కూడా నెలకు రూ.1,500 అందలేదని షర్మిల గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయినా, హామీ ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు.ఫ్రీ బస్సు పథకం 14 నెలల తర్వాత మొదలుపెట్టారని, దానిని సూపర్ సక్సెస్ అని చెప్పుకోవడం ప్రజలకే హాస్యాస్పదంగా ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. గోరంత చేసి కొండంత చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు.
మ్యానిఫెస్టో వాగ్దానాలు?
జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మాటిచ్చి మరిచిపోయారని ఆమె ఆరోపించారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి పెంచారని, జర్నలిస్టులకు ఉచిత స్థలం ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు.మొత్తం మీద సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందని పేర్కొన్నారు.
Read Also :