Shabarimala: అయ్యప్ప స్వామి భక్తి 41 రోజుల కఠిన నియమాలతో నిర్వహించే పవిత్ర దీక్షగా భావించబడుతుంది. కానీ ఇటీవల, ఈ యాత్రలో రాజకీయ రంగానికి సంబంధించి వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు(YCP leaders) శబరిమల యాత్రలో జగన్ ఫొటోలు, ఫ్లెక్సీలను ప్రదర్శించడం పెద్ద హల్‌చల్ కు కారణమైంది.
Read Also: Ditwa Effect: నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్స్’ అలర్ట్

‘జగన్ 2.0’ అనే నినాదాలతో బ్యానర్లు
పెందుర్తి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు అయ్యప్ప మాల ధరించి యాత్రకు వెళ్లగా, వారు ‘జగన్ 2.0’ అనే నినాదాలతో బ్యానర్లు ప్రదర్శించారు. అంతేకాకుండా, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మరియు ఇతర స్థానిక నేతల ఫొటోలతో కూడిన మూడు ఫ్లెక్సీలను కూడా ఉంచారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారే జరిగటం కాదు. కొన్ని రోజుల క్రితం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రాంతంలోని వైసీపీ భక్తులు కూడా శబరిమల(Shabarimala) యాత్రలో జగన్ ఫొటోలు, నినాదాలను ప్రదర్శించారు.
భక్తులు మరియు హిందూ సంఘాలు పవిత్ర యాత్రను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులతో కూడిన ఈ పవిత్ర పర్వదినం ఇలా రాజకీయ హంగామాకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని వారు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: