Savitribai Phule Jayanti : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన Savitribai Phule జయంతి సందర్భంగా Nara Chandrababu Naidu ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆనాడు సమాజంలోని కట్టుబాట్లను ఎదురించి సావిత్రిబాయి చేసిన పోరాటం, నేటి మహిళా శక్తికి బలమైన పునాదిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
సావిత్రిబాయి పూలే మహిళల విద్యకే కాదు, పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయికి మహిళలను తీసుకువచ్చారని చంద్రబాబు తెలిపారు. ఆమె చూపిన మార్గంలోనే నేటి మహిళలు రాజకీయాలు, విద్య, సైన్స్, వ్యాపారం వంటి అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం
సమాజంలో సగభాగమైన మహిళల అభివృద్ధిలో (Savitribai Phule Jayanti) సావిత్రిబాయి పూలే పాత్ర అమూల్యమని సీఎం గుర్తు చేశారు. మహిళా విద్యకు వెలుగులు నింపిన ఆమెకు ఆధునిక మహిళలు సదా కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళా విద్యా వికాసానికి ఆమె చేసిన సేవలను స్మరిస్తూ మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు చంద్రబాబు తన సోషల్ మీడియా సందేశంలో తెలిపారు.
ఇదే సందర్భంగా మంత్రి Nara Lokesh కూడా సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించారు. సావిత్రిబాయి మన దేశంలో తొలి మహిళా టీచర్ అని, స్త్రీ విద్య, హక్కుల సాధన కోసం ఆమె జీవితాంతం అంకితభావంతో పనిచేశారని లోకేశ్ కొనియాడారు.
ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పుకు శక్తివంతమైన సాధనంగా భావించిన సావిత్రిబాయి, తీవ్ర వ్యతిరేకతలు, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారని ఆయన తెలిపారు. నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆమె ఒక ఆదర్శమని పేర్కొంటూ, సావిత్రిబాయి పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి అని లోకేశ్ అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: