ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా వేడి పెరుగుతోంది. లిక్కర్ స్కాం (Liquor scam) కేసులో మాజీ సీఎం జగన్‌పై ఆరోపణలు, విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav)చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

“జగన్ అసలైన సూత్రధారి.. అరెస్ట్ కావడం తథ్యం”
తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ (Satya Kumar Yadav) మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “లిక్కర్ స్కాం వెనక అసలైన మాస్టర్‌మైండ్ జగన్ (Jagan) మాత్రమే. ఆయన త్వరలోనే అరెస్టు అవుతారు. అందుకే ఇప్పుడు దయకు తావిచ్చేలా వ్యవహరిస్తూ ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారు,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో నాసిరక మద్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురైన విషయం. “ఇది ఒక్క సారి కాదు అనేక సార్లు మద్యం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. ఇది వాస్తవం కాదా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
జగన్ దృష్టిమార్పు కోసం డ్రామాలే
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిస్తే… జగన్ మాత్రం ప్రజల దృష్టిని మళ్లించేలా డ్రామాలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వచ్చి జగన్ ప్రజల సమస్యలపై చర్చించగలరా? అని ప్రశ్నించారు. అలా కాకుండా దాడి చేస్తాం, విమర్శలు గుప్పిస్తాం, దూషణలకు దిగుతాం, పారిపోతాం అనే మాటలు రాజకీయ నాయకుల లక్షణం కాదన్నారు. కూటమి ఏడాది పాలనపై జగన్ సొంత ఛానల్‌లో చర్చకు తాను సిద్ధమని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: