సంక్రాంతి సమయం దగ్గరపడుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు వెళ్లే వారి ప్రయాణ ఇబ్బందులు ముందుగానే మొదలయ్యాయి. హైదరాబాద్‌లో ఉంటూ స్వగ్రామాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు ఇప్పటికే రవాణా సౌకర్యాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా పండగకు చాలా రోజులు ఉన్నా, రైళ్లు బస్సులు పూర్తిగా ఫుల్ కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
Read also: Minister Jupally: కేసీఆర్ అప్పులు తెలంగాణ ఆర్థిక బరువుకు కారణం

The hardships of the Sankranti festival have begun
కొన్ని తేదీల్లో ‘రిగ్రెట్’ వరకు చేరడం
సాధారణంగా సంక్రాంతి (sankranti) సమయానికి ఏపీ వైపు భారీగా ప్రజలు తరలుతుంటారు. కానీ ఈసారి పరిస్థితి ఇంకా కఠినంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరి, గరీబ్‌రథ్, చార్మినార్, సింహపురి వంటి ప్రధాన రైళ్లలో రిజర్వేషన్లు మొదటి రోజుల్లోనే పూర్తిగా నిండిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ వందల్లోకి వెళ్లి, కొన్ని తేదీల్లో ‘రిగ్రెట్’ వరకు చేరడం ప్రయాణ అవకాశాలను పూర్తిగా తగ్గిస్తోంది. బస్సుల్లో కూడా ఇదే పరిస్థితి. ఏపీఎస్‌ఆర్టీసీ సీట్లు ఎక్కువ భాగం బుక్ అయిపోయి, టీజీఎస్‌ఆర్టీసీలో మాత్రమే కొంత మేరకు సీట్లు కనిపిస్తున్నాయి.
మరోవైపు విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఉండే రేటుకంటే కొన్ని తేదీల్లో 50–100 శాతం వరకు ఛార్జీలు పెరిగాయి. జనవరి 9 నుండి 13 వరకు డిమాండ్ పెరగడం, కానీ ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లు ప్రత్యేక బస్సుల ప్రకటన లేకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ప్రయాణాలు ఎలా ప్లాన్ చేయాలా అనే ఆలోచనలో ప్రయాణికులు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :