తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ(Sankranti Special) సందడి మొదలైంది. సెలవులు ఖరారవడంతో స్వగ్రామాలు, పర్యాటక ప్రాంతాల బాట పట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా పర్యాటకులకు భిన్నమైన అనుభూతి అందించేందుకు ఏపీ ప్రభుత్వం కారవాన్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read also: Andhra Pradesh: వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి

నాలుగు మార్గాల్లో కారవాన్ ప్యాకేజీలు ప్రకటించిన APTDC
ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) నాలుగు ఎంపిక చేసిన మార్గాల్లో కారవాన్ టూరిజం ప్యాకేజీలను ప్రకటించింది. APTDC అధికారిక పోర్టల్ ద్వారా ఈ కారవాన్ వాహనాలను సులభంగా బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇందుకోసం రెండు ప్రైవేట్ సంస్థలను ఎంప్యానల్ చేయగా, ప్రారంభ దశలో నాలుగు కారవాన్‌లను నడపనున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కారవాన్‌లలో 10 నుంచి 12 సీట్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే సీట్లను నిద్రించే విధంగా మార్చుకునే అవకాశం ఉంది. వాహనాల్లో టీవీ, ఫ్రిజ్, వాష్‌రూమ్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పర్యటన సమయంలో రాత్రిళ్లు కారవాన్‌లోనే బస చేసేలా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్–భీమవరం–దిండి ప్రత్యేక 6 రోజుల ప్యాకేజీ
సంక్రాంతి(Sankranti Special) సందర్భంగా హైదరాబాద్ నుంచి భీమవరం, దిండి వరకు ప్రత్యేకంగా 6 రోజుల కారవాన్ ప్యాకేజీని APTDC ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ ధర రూ.3.50 లక్షలు. జనవరి 10, 11, 12 తేదీల్లో బుకింగ్ అందుబాటులో ఉండగా, ఆ తేదీల నుంచి ఆరు రోజుల పాటు టూర్ నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల్లో హైదరాబాద్ నుంచి నాలుగు కారవాన్‌లు బయలుదేరనున్నాయి.
ప్రకటించిన నాలుగు మార్గాలు.. ప్యాకేజీ ధరలు ఇవే
APTDC ప్రకటించిన కారవాన్ టూరిజం మార్గాలు, ధరలు ఇలా ఉన్నాయి:
- విశాఖపట్నం – అరకు – లంబసింగి (1.5 రోజులు)
- రూ.42,500 (10–12 సీట్ల కారవాన్)
- రూ.31,500 (5–6 సీట్ల కారవాన్)
- విశాఖపట్నం – సింహాచలం – అన్నవరం – పిఠాపురం – సామర్లకోట – ద్రాక్షారామం – వాడపల్లి (1.5 రోజులు)
- రూ.42,500 (10–12 సీట్లు)
- రూ.31,500 (5–6 సీట్లు)
- హైదరాబాద్ – గండికోట (2 రోజులు)
- రూ.85,000 (10–12 సీట్లు)
- రూ.64,000 (5–6 సీట్లు)
- హైదరాబాద్ – సూర్యలంక బీచ్ (2 రోజులు)
- రూ.85,000 (10–12 సీట్లు)
- రూ.64,000 (5–6 సీట్లు)
ఏపీలో తొలిసారి కారవాన్ టూరిజం
కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన కారవాన్ టూరిజం ఇప్పుడు ఏపీలోనూ ప్రారంభమైంది. పర్యాటకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ కొత్త టూరిజం కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: