ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి (Puttaparthi) శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకి ముస్తాబైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పుట్టపర్తి(Puttaparthi) లోని హిల్ వ్యూ ఆడిటోరియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
Read Also: Tulasi: సినిమాలకి తులసి గుడ్ బై

సత్యసాయి మహా సమాధిని సచిన్, ఐశ్వర్య రాయ్ దర్శించుకున్నారు
ప్రశాంత నిలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల భవనాలన్నీ రంగు రంగుల దీపాలతో అత్యంత సుందరంగా సిద్ధం చేశారు. శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలకు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ హాజరయ్యారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని సచిన్, ఐశ్వర్య రాయ్ దర్శించుకున్నారు.
ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మర్యాదపూర్వకంగా కలిశారు. సచిన్‌ను కలిసిన వారిలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: