శబరిమలలో భక్తుల రద్దీ కాస్త అదుపులోకి
శబరిమల అయ్యప్ప ఆలయంలో(Sabarimala) మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం రెండో రోజు నుండే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రోజుకు సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనం కోసం చేరడం వల్ల ఆలయ ప్రాంగణంలో తీవ్ర అవస్థలు ఏర్పడుతున్నాయి. క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిలబడటంతో, తాగునీటి సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరు భక్తులు క్యూలైన్లను దాటిపెట్టి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆలయ భద్రతా సిబ్బందికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది.
Read also: శతజయంతి వేడుకల్లో మోదీ: “ప్రేమ, సేవ సత్యసాయిబాబా జీవన సందేశం”

భక్తుల రద్దీ నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు
ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధినేత కె. జయకుమార్ భక్తుల భద్రత కోసం తక్షణ చర్యలు ప్రారంభించారు. క్యూలైన్లలో నీరు, బిస్కెట్లు అందించడానికి 200 మంది అదనపు సిబ్బందిని నియమించడం, భక్తులు(Sabarimala) క్యూలైన్లను ఉల్లంఘించకుండా చూడడం, పంబ నది వద్ద భక్తులను కొంత నియంత్రించడం వంటి ఏర్పాట్లు చేపట్టారు. అలాగే, నిలక్కల్‌లో 7 అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసి దర్శన టికెట్లు అక్కడే బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో శుభ్రత కోసం తమిళనాడు(Tamil Nadu) నుంచి 200 మంది క్లీనింగ్ సిబ్బందిని తీసుకువచ్చారు. ఈ చర్యల ద్వారా భక్తుల రద్దీని క్రమంగా నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :