తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన 12,702 మంది సర్పంచులు, 1,11,803 మంది వార్డు సభ్యులు గ్రామ పాలనలో కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో గ్రామ పంచాయతీ అనేది పునాదివంటిది. గ్రామ పంచాయతీ బలంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధిబాటలో నడుస్తుంది. అలాంటి గ్రామ పంచాయతీలకు నాయకత్వం వహించే సర్పంచుల పాత్ర అత్యంత కీలకం. అయితే గ్రామాభివృద్ధి (Rural development ) అనేది మాటల్లో కాకుండా కార్యరూపంలోకి రావాలంటే సర్పంచులు అనేక సవాళ్లను ఎదుర్కొని, అవగాహనతో, నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామ సర్పంచుల ముందు నిలిచే మొదటి పెద్ద సవాలు అభివృద్ధి పట్ల సరైన అవగాహన లేకపోవడం. చాలా మంది సర్పంచులు ప్రజా భిమానంతో ఎన్నికైనా, పాలనా విధానాలు, ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగం, చట్టపరమైన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం కనిపిస్తోంది. ఫలితంగా గ్రామానికి రావాల్సిన నిధులను సద్వినియోగం చేయలేకపో వడం, లేదా పథకాలను పూర్తిగా అమలు చేయలేకపోవడం జరుగుతోంది. కాబట్టి గ్రామాభివృద్ధి(Rural development) కోసం ముందు సర్పం చులే శిక్షణపొందాల్సిన అవసరంఉంది. నిధుల కొరత మరో ప్రధాన సమస్య. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి గ్రామ పం చాయతీలకు నిధులు వస్తున్నా అవి చాలవు. రోడ్లు, తాగు నీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, పాఠశాలలు, ఆరోగ్య సదు పాయాలు వంటి అనేక అవసరాలకు ఒకేసారి నిధులు అవసరం అవుతాయి. కానీ పరిమిత నిధులతో అన్ని పను లు చేయడం సర్పంచులకుపెద్ద సవాలుగా మారుతోంది. అంతేకాకుండా, కొన్నిసార్లు నిధులు ఆలస్యంగా రావడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. నిధులు వచ్చినా వాటి సరైన వినియోగం కూడా ఒక పెద్దసమస్యే. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, అధికారులపై ఆధారపడాల్సి రావడం వల్ల కొన్ని చోట్లఅవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా యి. ఇది గ్రామాభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతోంది. సర్పం చులు నిజాయితీగా ఉన్నా, వ్యవస్థలోని లోపాలవల్ల ప్రజల్లో వారి మీద నమ్మకం తగ్గేపరిస్థితి ఏర్పడుతోంది. గ్రామాభివృద్ధి లో మరోసవాలు ప్రజల భాగస్వామ్యం లేకపోవడం.
Read Also : http://Mining case: ఆరావళి పర్వతాలపై ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసిన సుప్రీం

అభివృద్ధిఅనేది కేవలం సర్పంచి బాధ్యత మాత్రమే కాదు. గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలి. కానీ చాలా గ్రామాల్లో ప్రజలు సమావేశాలకు రాకపోవడం, గ్రామసభలను పట్టించుకోకపోవడం కనిపిస్తోంది. ఫలితంగా సర్పంచులు తీసుకునే నిర్ణయాలకు పూర్తిమద్దతు లభించడంలేదు. ప్రజల సహకారం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. రాజకీయ జోక్యం కూడా సర్పంచుల పనితీరును ప్రభావితం చేసే అంశం. గ్రామస్థాయిలోనే వర్గ పోరులు, రాజకీయ విభేదాలు సర్పంచులు ముందున్న పెద్ద సమస్య. అభివృద్ధి పనులను రాజకీయ కోణంలో చూసి అడ్డుకోవడం, వ్యక్తిగత లాభనష్టా ల కోసం పనులను నిలిపివేయడం జరుగుతోంది. దీనివల్ల గ్రామానికి మేలు చేసే పనులు కూడా ఆలస్యమవుతు న్నాయి. ఇకఅధికారులతో సమన్వయం లోపించడం కూడా ఒక సవాలే. గ్రామ పంచాయతీకి సంబంధించిన పనుల్లో పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీర్లు, ఇతర శాఖల అధికా రులు కీలక పాత్ర పోషిస్తారు. వీరితో సమన్వయం సరిగా లేకపోతే పనులు ముందుకు సాగవు. కొన్నిసార్లు అధికారులు నిర్లక్ష్యం, ఆలస్యంవల్ల సర్పంచులు ప్రజల విమర్శలకు గుర వుతున్నారు. అయితే ఈ సవాళ్ల మధ్య సర్పంచులు చేయా ల్సిన బాధ్యతలు మరింత పెరుగుతున్నాయి. కేవలం ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా స్థానికంగా నిధులు సృష్టించుకో వడం నేటి అవసరం. గ్రామపంచాయతీ పరిధిలోని మార్కె ట్లు, వారపుసంతలు, దుకాణాలు, ప్రకటనల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. ఆస్తిపన్ను, నీటి పన్నువంటి వాటిని సమర్థ వంతంగా వసూలు చేయడంద్వారా కూడా గ్రామానికి ఆదా యం సమకూర్చుకోవచ్చు. ఈ విషయంలో సర్పంచులు ధైర్యంగా, పారదర్శకంగావ్యవహరించాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ఎంతో అవసరం. డిజిటల్ పాలన, ఆన్లైన్ దరఖాస్తులు, పారదర్శక లెక్కల నిర్వహణ ద్వారా గ్రామపాలన మరింత సమర్థవంతంగా మారుతుంది. యువతను గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా చేయడం ద్వారా కొత్తఆలోచనలు, కొత్తమార్గాలు ముందుకువస్తాయి. మొత్తంగా చూస్తే, తెలంగాణ గ్రామ సర్పంచుల ముందు ఉన్న సవాళ్లు అనేకమైనా, అవి అధిగమించలేనివి కావు. సరైన అవగాహన, నిజాయితీ, ప్రజల భాగస్వామ్యం, అధి కారులతో సమన్వయం, స్థానిక నిధుల సృష్టివంటి అంశాలపై దృష్టి సారిస్తే గ్రామాభివృద్ధిసాధ్యమే. గ్రామం అభివృద్ధిచెంది తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధికి పునాది వేయాల్సిన బాధ్యతగ్రామ సర్పంచులదే.
-తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: