RTO Challan: ఏపీలో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. “ఆర్‌టీవో చలాన్” పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా మెసేజ్‌లు షేర్ అవుతున్నాయి. ఈ మెసేజ్‌లతో పాటు ఒక “ఆర్‌టీవో చలాన్ ఏపీకే” ఫైల్‌ను పంపిస్తూ వాహనదారులను టార్గెట్ చేస్తున్నారు. “మీ వాహనంపై ఈ-చలాన్ నమోదైంది, వెంటనే చెక్ చేయకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలవుతుంది” అనే బెదిరింపు సందేశంతో ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఫోన్‌లోని కాంటాక్టులు, మెసేజ్‌లు వంటి సమాచారం హ్యాకర్లకు చేరిపోతోంది. ఇంకా, ఆ ఫోన్ నుంచి ఇతర కాంటాక్టులకు కూడా అదే మాల్వేర్ ఆటోమేటిక్‌గా షేర్ అవుతోంది.
Read also: TTD: మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

RTO Challan: ఆ వాట్సాప్ మెసేజ్‌తో జాగ్రత్త..
మోసం చేసే విధానం ఇదే..
RTO Challan: ఈ ఫైల్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్ హ్యాంగ్ అవడం, వాట్సాప్ (whatsapp) పనిచేయకపోవడం, బ్యాటరీ వేగంగా తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు దొంగల చేతుల్లో పడే ప్రమాదం ఉంది. నిపుణులు ప్రజలకు హెచ్చరిస్తూ, ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు లేదా ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని సూచిస్తున్నారు. ఫోన్ ఇప్పటికే ఇన్‌ఫెక్ట్ అయితే వెంటనే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లి మాల్వేర్‌ను తొలగించుకోవాలని, అవసరమైతే సాఫ్ట్‌వేర్‌ను రీ-ఇన్‌స్టాల్ చేయించుకోవాలని సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: