ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్న వేళ, మాజీ మంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా (Roja) కీలక వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని నిలదీసారు. మహిళల అక్రమ రవాణా, పవన్ కల్యాణ్ మౌనం, కూటమి హామీల విస్మరణ, మరియు జగన్ సభలపై ప్రభుత్వ కుట్ర అనే అంశాలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మహిళల అక్రమ రవాణాపై పవన్ మౌనం – రోజా ప్రశ్నలు
తాజాగా మహిళల అక్రమ రవాణా అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహిళల అక్రమ రవాణా అంశాన్ని ప్రస్తావిస్తూ “మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా పవన్ కల్యాణ్. మరి ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ లను తొక్కిపెట్టి నార తీయాలి కదా?” అని ఆయనను ఉద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా అంశంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమ అధినేత జగన్ సభలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను అడ్డుకునేందుకే ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంపై ‘సూపర్ సిక్స్’ విమర్శ
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. “పాలనను పక్కనపెట్టి దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు” అని రోజా పేర్కొన్నారు.
ఈవీఎంల ద్వారా గోల్‌మాల్ – ప్రజలు జగన్‌ను ఓడించలేదని ఆరోపణ
ఎన్నికల ఫలితాలపై కూడా రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ – ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు ఓడించలేదని, ఈవీఎంలలో జరిగిన గోల్‌మాల్ ద్వారానే ఆయన ఓటమిపాలయ్యారని ఆమె ఆరోపించారు. “అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది” అని రోజా వ్యాఖ్యానించారు.
రాజకీయంగా ఉత్కంఠ, వైసీపీ అటాక్ మోడ్
వైఎస్ జగన్ నిర్వహించే సభలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరాకుండా అడ్డుకోవాలనేది ప్రభుత్వ కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని రోజా అభిప్రాయపడ్డారు.
Read also: Chevireddy Mohit Reddy: సిట్ విచారణకు హాజరుకాని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి