శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ నిధులతో అభివృద్ధి (DEVELOPMENT) పనులకు పెద్ద పీట వేస్తున్నామని శ్రీకాళహస్తి ఆలయాన్ని తిరుమల తరహాలో తీర్చి దిద్దుటకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళుతున్నామని శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రెండు కీలకమైన రోడ్ల నిర్మానానికి భూమి పూజలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధియే అజెండాగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని గతంలో ఐదేళ్ళు పరిపాలించిన నాయకుడు రూ.20కోట్లు చేయని పనులకు రూ.49కోట్లతో దిగమింగటానికి ప్రణాళికలు రచించుకున్నారని అయితే ముక్కంటీశుడు ఆయనను ఓడించి తన నిధులను కాపాడుకున్నారని సుధీర్రెడ్డి (Sudheer Reddy) విమర్శించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ నిధులతో రెండు రోడ్ల నిర్మానానికి శుక్రవారం భూమి పూజా కార్యక్రమాలను ఆలయ ఇఓ డి. బాపిరెడ్డి ఏర్పాటు చేసారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా జాతీయ రహాదారి నుంచి స్వర్ణముఖీ తీరాన సుమారు 2.45 కిలో మీటర్లు రోడ్డును శివంటు శివం రోడ్డుగా నిర్మించనున్నట్లు వివరించారు. ఈ రోడ్డు పనులకు రూ.19 టెండర్ అంచనాలతో చేపట్టుటకు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి శంకు స్థాపన చేసారు. అలాగే గతంలో గిరిప్రదక్షిణ రోడ్డులో 11 కిలో మీటర్లు సిమెంటు రడ్డును నిర్మించారు. ఈ రోడ్డు మొత్తం 20కిలో మీటర్లు కాగా ఏడు కిలో మీటర్ల సిమెంటు రోడ్డు పనులకు శుక్రవారం శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి భూమి పూజలు జరిపారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఏడాదిన్నర పాలనలో ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దామన్నారు.
VISIT TO : Hindi.vaartha.com
READ MORE :