ఆంధ్రప్రదేశ్ (AP) లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడి పెట్టనుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రాన్ని హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు బలం చేకూర్చేలా మరో కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్‌సీ అనుబంధ సంస్థ రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టనుంది.
Read Also: Hyd: అక్రమ కట్టడాలకు కేరాఫ్ గా మారిన అల్లాపూర్
స్పందించిన నారా లోకేష్
రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ సంస్థ దేశంలోనే తొలి 6 గిగావాట్ సోలార్ ఇంగోట్ వేఫర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ (AP) లో నెలకొల్పనుంది. రూ.3990 కోట్ల పెట్టుబడితో అనకాపల్లిలో ఈ ఇంగోట్ వేఫర్ యూనిట్ నెలకొల్పనున్నట్లు సమాచారం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగం భవిష్యత్తులో ఇదో భారీ విజయంగా నారా లోకేష్ అభివర్ణించారు.
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఈ ఇంగోట్ వేఫర్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు. తమ అంకితభావాన్ని చేతలలో చూపుతున్నామని పేర్కొన్నారు. నెక్ట్స్ జనరేషన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌కు ఏపీ గమ్యస్థానంగా మారుతోందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: