ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డోన్ పర్యటనలో తనపై చేసిన భూకబ్జా ఆరోపణలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదును ఆధారం చేసుకుని, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై నిందలు వేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని ఆయన హితవు పలికారు. సభలో పిటిషన్ ఇచ్చిన వ్యక్తి సమస్య పూర్తిగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదా అని, అందుకే రెండేళ్లుగా ఏ అధికారి కూడా దానిని పరిష్కరించలేకపోయారని బుగ్గన వివరణ ఇచ్చారు. స్వయంగా ఆర్డీవో (RDO) ఆ భూమి ‘అసైన్డ్ భూమి’ అని, ఫిర్యాదుదారునికి దానితో సంబంధం లేదని చెబుతున్నా, చంద్రబాబు ఆ మాటలను పట్టించుకోకుండా అధికారులను ‘బుల్డోజ్’ చేయడం రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆయన మండిపడ్డారు. మీకు బాధితుడికి న్యాయం చేయడం ముఖ్యామా లేక ప్రతిపక్షంపై బురద చల్లడం ముఖ్యామా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Read Also : AP MLAs: దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే
తన కుటుంబ నేపథ్యాన్ని మరియు ఆస్తుల వివరాలను ప్రస్తావిస్తూ బుగ్గన భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం వందేళ్ల క్రితం ఏ ఇంట్లో ఉందో, ఈ రోజు కూడా అదే ఇంట్లో నివసిస్తోందని.. తమకు ఇతరుల ఆస్తులపై ఆశ లేదని ఆయన స్పష్టం చేశారు. పైగా తమకున్న ఆస్తుల్లో 75 శాతం ప్రజల కోసం దానం చేసిన చరిత్ర తమదని, ఆ దానాల జాబితా చూడాలంటే ముఖ్యమంత్రికి ఒక రోజంతా పడుతుందని సవాల్ విసిరారు. వందేళ్ల క్రితం చంద్రబాబు కానీ, ఆయన అనుచరులు కానీ ఎక్కడ ఉన్నారో చెప్పగలరా అని ప్రశ్నిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలపై నిజనిర్ధారణ కోసం కలెక్టర్‌ను ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని, అధికార బలంతో అధికారుల గొంతు నొక్కడం సరైన పద్ధతి కాదని బుగ్గన ఈ సందర్భంగా హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :